పాపికొండల యాత్రలో విషాదం

papikonadaluతూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిపై పాపికొండలు విహార యాత్రకు 65 మందితో వెళుతున్న ఒక ప్రైవేటు బోటు గోదావరి నదిలో మునిగి పోయింది. చుట్టూ 25 మందిని కాపాడిన చుట్టుపక్కల గ్రామస్తులు. గోదావరి వరద ఉధృతంగా ఉండడం ఈ ఘటన కారణంగా చెబుతున్నారు. ఘటనలో చిక్కుకున్న వారిలో అత్యధికంగా 35 మంది హైదరాబాద్కు చెందిన వారు కాగా 15 మంది వరంగల్కు చెందిన వారిగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి, ఘటనాస్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మరియొక హెలికాప్టర్ను పంపించి సహాయక చర్యలు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం పూట ఎండ వేడి అధికంగా ఉండడం వల్ల వీడికి లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వలన ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంఘటన విషయాన్ని తెలుసుకున్న ప్రధాని మోడీ బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.

Videos