అమరవతిపై బొత్స కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే  ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ వ్యయం కంటే ఎక్కువ అవుతోందని ఈ సందర్భంగా బొత్స అన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమవుతోందని పేర్కొన్నారు. ఇటీవల సంభవించిన వరదలతో అక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉన్నాయని తెలిసిందని, దీని నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, డ్యామ్‌లు నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల  ప్రభుత్వంపై అదనపు భారం పడనుందని, దాంతో ప్రజాధనం వృథా అవుతుందని బొత్స వివరించారు. రాజధానిపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని బొత్స వెల్లడించారు.

Videos

2,182 thoughts on “అమరవతిపై బొత్స కీలక వ్యాఖ్యలు