మంత్రి బొత్స సత్యనారాయణకు సి‌బి‌ఐ నోటీసులు

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్సకు నోటీసులు పంపారు. విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌ వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని పలువురు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారనేది కేసులో ప్రధాన అభియోగం. దీనితో ఆయనకు హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరుకావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. వైఎస్‌ సర్కారులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. నాంపల్లి సీబీఐ కోర్టులో 2010లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌ షీట్‌ ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వాంగ్మూలం నమోదుకోసం సెప్టెంబర్‌ 12న హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వశిష్ఠ వాహన్‌ మాజీ అధికారి హెల్మంత్, అశోక్‌కుమార్‌జైన్, వశిష్ఠ వాహన్‌ డైరెక్టర్లు జగదీశ్ అలగ్‌రాజా, గాయిత్రీ రాయ్‌, వీకే చతుర్వేది, జోసఫ్ వీ జార్జ్‌ దీనిలో నిందితులుగా ఉన్నారు.

Videos

862 thoughts on “మంత్రి బొత్స సత్యనారాయణకు సి‌బి‌ఐ నోటీసులు