బ్రహ్మోత్సవం సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు, టీమ్ రోజుకో పోస్టర్స్‌తో సందడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక కొద్దిసేపటి క్రితం ఈ క్రమంలోనే ఓ సాంగ్ టీజర్‌ను విడుదల చేశారు. సినిమా పేరుకు తగ్గట్టుగానే ఈ టీజర్ కలర్‍ఫుల్‌గా సాగిపోయింది. ముఖ్యంగా ‘మధురం మధురం’ అంటూ వచ్చే మధురాష్టకం పద్యంలోని లైన్స్‌కి మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్ వినసొంపుగా ఉండి టీజర్‌కు ఓ అందాన్ని తెచ్చిపెట్టింది.

ఇక ఈ టీజర్‌లో మహేష్ ఎప్పట్లానే చార్మింగ్ లుక్స్‌తో కట్టిపడేశాడు. మహేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలల సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ‘బ్రహ్మోత్సవం’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది. ఈనెల 7న హైద్రాబాద్‌లో వైభవంగా ఆడియో రిలీజ్ జరగనుండగా, 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీవీపీ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

Videos

17 thoughts on “బ్రహ్మోత్సవం సాంగ్

Leave a Reply

Your email address will not be published.