బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు – విడిపోవడానికే బ్రిటన్ వాసి పట్టం

బ్రిగ్జిట్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఐరోపా సమాఖ్య(ఈయూ)లో బ్రిటన్ కొనసాగాలా వద్ద అనే దానిపై నిర్వహించిన రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. బ్రిటన్ వాసులు ఎటువైపు మొగ్గు చూపారో మరికాసేపట్లో తేలనుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సండర్లాండ్, కోవెంట్రి, కోల్బస్టర్ ఓటర్లు ఈయూ నుంచి విడిపోవడానికి మొగ్గు చూపారు. ఇక గ్తాస్గో, లివర్ పూల్, లండన్ ఓటర్లు మాత్రం ఈయూలో కలిసే ఉండాలని తేల్చారు. పూర్తి ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి.

బ్రిటన్‌ వాసులు రెండు వర్గాలుగా విడిపోయి బ్రెగ్జిట్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా హోరాహోరీగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రెండు వర్గాల వారు తమదైన వాదనల్ని వినిపించారు. వాటిని చూస్తే..
బ్రెగ్జిట్‌కు మద్దతు, వ్యతిరేకుల వాదనలు..

* ఈయూలోని ఇతర దేశాల నుంచి బ్రిటన్‌లోకి వలసదారులు పెరిగి తమ ఉపాధికి ఎసరు పెడుతున్నారని ఎక్కువమంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇతర ప్రధాన దేశాలతో బ్రిటన్‌ నేరుగా వాణిజ్యాన్ని నిర్వహించలేక అనేక అవకాశాలను చేజార్చుకుంటోందని బ్రెగ్జిట్‌ మద్దతుదార్ల వాదన.
* ఈయూలో సభ్యదేశంగా ఉంటే బ్రిటన్‌ ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. ఈయూ నుంచి బయటకు వస్తే పన్నుల విధానాన్ని సొంతంగా రూపొందించుకోవచ్చని, ప్రతి వారం ఈయూకి పంపే మొత్తంతో ఆధునిక సదుపాయాలు కలిగిన ఆస్పత్రి నిర్మించుకోవచ్చని మద్దతుదార్ల మరో వాదన.
* ప్రస్తుతం ఆహార పదార్థాలు, ఇంధనం, విద్యుత్‌ అందుబాటు ధరలకు లభిస్తున్నాయని… బయటికి వెళ్లిపోతే ప్రభుత్వంపై పెనుభారం పడుతుందని వ్యతిరేకులు అన్నారు.
* లక్షలాది ఉద్యోగాలు ఈయూ-బ్రిటన్‌ వాణిజ్యంతో ముడిపడి ఉన్నాయని, మహిళా ఉద్యోగులకు భద్రత ఉందన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *