ఇది చూస్తే జీవితంలో ప్రైవేట్‌ బస్సెక్కరు

ఈ వీడియో చూస్తే కచ్చితంగా గుండె ఆగినంతపనవుతుంది. జీవితంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఎక్కకూడదని అనిపిస్తుంది. నిండా ప్రయాణీకులను పెట్టుకొని బస్సులనే రేసు బైకుల మాదిరిగా అడ్డదిడ్డంగా ఇష్టమొచ్చినట్లుగా నడిపిన తీరుతో ఉన్న ఈ వీడియోను చూస్తే ఒళ్లుగగుర్పొడవక మానదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరు-పొల్లాచి జాతీయ రహదారిలో ఇద్దరు ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఉన్నట్లుండి పోటీ పడ్డారు. తొలుత ఓ బస్సు మరో బస్సును క్రాస్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆ బస్సు డ్రైవర్‌ పక్కకు తొలగలేదు.

దీంతో ఏకంగా క్రాస్‌ చేయాలనుకున్న మరో బస్సు డ్రైవర్‌ అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లాడు. ఆ రోడ్డు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో దుమ్మురేగిపోయింది. ఇలా ఒకరిని ఒకరిని ఒకరు క్రాస్‌ చేస్తూ బైకు రేసు మాదిరిగా గాల్లో తేలిపోయే వేగంతో దూసుకెళుతుంటూ ఎదురుగా వచ్చే వాహనాలకు, పక్కన వెళ్లే వారికి గుండెఆగినంతపనైంది. ఇక ఆ బస్సుల్లో ఉన్నవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. వాటి వెనుకాలే వస్తున్న ఓ బైకిస్టు ఈ వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా పెద్ద సంచలనం అయింది. ఆ బస్సు డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేశారు. మరోసారి ఇలాంటి బస్సులను నడిపిస్తే పర్మిట్‌ రద్దు చేస్తామంటూ సంబంధిత అధికారులు హెచ్చరించారు. వారి మధ్య ఈ రేసు చాలా కిలోమీటర్లు సాగింది.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *