రివ్యూ: C/o కంచరపాలెం. అద్భుతమైన స్క్రీన్.. ప్రేక్షకుడిని వెంటాడే సినిమా..

కథ :
ఇది వయసు పరంగా నాలుగు కేటగిరిలో ఉన్న నాలుగు జంటల ప్రేమకథ. సుందరం (కేశవ కర్రి) స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్‌ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. జోసెఫ్‌ (కార్తీక్‌ రత్నం) టీనేజ్‌ కుర్రాడు. ఓ జిమ్‌లో పనిచేస్తూ గొడవలు, సెటిల్‌మెంట్స్‌ చేసే జోసెఫ్‌ ఓ గొడవ వల్ల పరిచయం అయిన భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్‌) అనే బ్రాహ్మణుల అమ్మాయిని ప్రేమిస్తాడు. గడ్డం (మోహన్ భగత్‌) వైన్‌ షాపులో పనిచేసే కుర్రాడు. తమ షాప్‌లో రోజు మందుకొనే ఓ వేశ్య సలీమా( విజయ ప్రవీణా పరుచూరి)ను కళ్లు చూసి ప్రేమిస్తాడు.

రాజు (సుబ్బారావు) ఓ గవర్నమెంట్‌ ఆఫీసులో అటెండర్‌. 49 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాకపోవటంతో ఊళ్లో అంతా రాజు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. అదే సమయంలో  ఒరిస్సా నుంచి ట్రాన్సఫర్‌ మీద తమ ఆఫీసుకు వచ్చిన ఆఫీసర్‌ రాధ( రాధ బెస్సీ) తో ప్రేమలో పడతాడు. భర్త చనిపోయి చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్న రాధ, రాజును పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలా కంచరపాలెంలో మొదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాలలో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి.? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అన్నదే కేరాఫ్ కంచరపాలెం కథ.

C/o కంచరపాలెం చిత్రానికి కర్త, కర్మ, క్రియ దర్శకుడు వెంకటేష్ మహా మాత్రమే. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనకు చెందాల్సిందే. వందలు, వేల కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటూ ప్రచారంలో మునిగితేలే దర్శకులకు కనివిప్పు కలిగించేలా వెంకటేష్ తన ప్రతిభను చాటుకొన్నారు. కథ, కథనాలు, సాంకేతిక అంశాలను చక్కగా మేలివించి తెలుగు సినీ ప్రపంచాన్నంతా తనవైపు చూసేలా చేసుకొన్నాడు. ప్రతీ సన్నివేశాన్ని బలంగా రాసుకొని తన టాలెంట్‌ను చాటుకొన్నాడు. సుమారు 60 మందికి పైగా కొత్తవాళ్లతో సినిమా చేసి శభాష్ అనిపించుకొన్నారు.

జోసెఫ్ పాత్రలో కార్తీక్ రత్నం, భార్గవిగా ప్రణీతా పట్నాయక్, గెడ్డంగా మోహన్ భగత్, సలీమాగా ప్రవీణ పరుచూరి, సుందరంగా కేశవ కర్రి, సునీతగా నిత్య శ్రీ, రాజు పాత్రలో సుబ్బరావు, రాధగా రాధ జెస్సీ నటించారు. వీరి పేర్లను కనీసం ఏ ప్రేక్షకుడు కూడా విని ఉండడు. అలాంటి వీరు తమ ప్రతిభతో ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తారు.

C/o కంచరపాలెం చిత్రానికి రెండో ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ీ చిత్రానికి ఆదిత్య జువ్వాడి, వరుణ్ చాపేకర్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపడంలో వీరు సఫలీకృతులయ్యారు. ముసలివాళ్ల ముచ్చట్లు, గ్రామంలో ఉండే కుల, మతాల సంఘర్షణ, పిల్లాడు సైకిల్ తొక్కే సీన్లు, తాగుబోతుల హంగామా లాంటి సీన్లను చక్కగా ఒడిసిపట్టుకొన్నారు.

బలం, బలహీనత

ప్లస్ పాయింట్స్

డైరెక్టర్ వెంకటేష్ మహా

నటీనటులు ప్రతిభ

కెమెరా

ఎడిటింగ్

సౌండ్ డిజైనింగ్

మ్యూజిక్

మైనస్ పాయింట్స్

బీ, సీ సెంటర్లకు నచ్చే కమర్షియల్ విలువలు లేకపోవడం

టైటిల్ : C/o కంచరపాలెం
రేటింగ్ : 3.5/5
జానర్ : డ్రామా
తారాగణం : సుబ్బారావు, రాధ బెస్సీ, కేశవ కర్రీ, నిత్య శ్రీ, కార్తీక్‌ రత్నం, విజయ ప్రవీణ, మోహన్‌ భగత్‌, ప్రణీత పట్నాయక్‌
సంగీతం : స్వీకర్‌ అగస్తీ
దర్శకత్వం : వెంకటేష్‌ మహా
నిర్మాత : విజయ ప్రవీణ పరుచూరి
సమర్పణ : రానా దగ్గుబాటి

Videos

Leave a Reply

Your email address will not be published.