షాక్: రిలీజ్ కు ముందే పూర్తి సినిమా లీక్

పైరసీ అంటే ఒకప్పుడు సినిమా విడుదలయ్యాక థియేటర్ల నుంచి జరిగేది. ఐతే మూడేళ్ల కిందట ‘అత్తారింటికి దారేది’ సినిమాను యూనిట్ సభ్యుల్లోనే ఒకడు విడుదలకు ముందే లీక్ చేసి విస్మయానికి గురి చేశాడు. గత ఏడాది మలయాళంలో సెన్సేషనల్ హిట్టయిన ‘ప్రేమమ్’ సినిమాను స్వయంగా సెన్సార్ బోర్డుకు చెందిన సభ్యులే లీక్ చేయడం సంచలనం రేపింది. ఐతే ఇప్పుడు ‘ఉడ్తా పంజాబ్’ కూడా విడుదలకు ముందే నెట్లోకి వచ్చేసి ఆ చిత్ర దర్శక నిర్మాతల గుండె పగిలేలా చేసింది. దారుణమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా గొంతు నొక్కాలని మొన్నటిదాకా తీవ్రంగా ప్రయత్నించిన సెన్సార్ బోర్డు దగ్గర్నుంచే ఈ సినిమా లీక్ అయింది. ‘ప్రేమమ్’ సినిమా విషయంలో జరిగింది వేరు. ఓ సెన్సార్ సభ్యుడెవరో తన కోసం ప్రేమమ్ సినిమాను మొబైల్లోకి ఎక్కించుకుంటే అది అనుకోకుండా బయటికి వచ్చేసినట్లు వార్తలొచ్చాయి.

సెన్సార్‌ చిక్కుల నుంచి బయట పడటంతో ఊపిరిపీల్చుకునే లోపే టోరెంట్ సైట్లలో సినిమా లీక్ కావడంతో తలపట్టుకున్నారు నిర్మాతలు. అయితే లీకైన సినిమా ప్రింట్లపై ‘ఫర్ సెన్సార్’ అనే ముద్ర ఉండటమే ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది. దాంతో ఈ సినిమా లీక్ అవటానికి కారణం… సెన్సార్‌ వారే కావచ్చన్న డౌట్ అందరూ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లీక్ ప్రింట్లపై సెన్సార్ డేట్ స్టాంప్ ఉండటంతో తాము సెన్సార్‌కు ఇచ్చిన ప్రింటే యథాతథంగా లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు గంటల ఇరవై నిముషాలు నిడివి ఉన్న ఈ సినిమా లీక్ కావటంతో యూనిట్ కు ఇప్పుడు ఆ టోరెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికిపట్టుకోవాల్సిన పనిలో పడ్డారు. అయితే లోపాయికారిగా… ఈ లీకేజ్ వ్యవహారం సెన్సార్ పనే అని అధికారికంగా చెప్పేందుకు మాత్రం చిత్ర యూనిట్ ముందుకురావటంలేదు. చెప్పి కొత్త సమస్యల్లో ఇరుక్కోవటం ఎందుకని టీమ్ భావిస్తోంది. ఏదైమైనా తక్షణ కర్తవ్యం..టోరెంట్స్ డిలేట్ చేయటం, థియేటర్ల వద్దకు సినిమాను సేఫ్‌గా తీసుకెళ్లడమే. ఈ సినిమాలో ..షాహిద్‌ విభిన్నమైన హెయిర్‌ స్టైల్స్‌తో కనిపించనున్నాడు.

ఒంటిపై 14 రకాలు టాటూలు పొడిపించుకున్నాడు. ఆలియా భట్‌ పూర్తి స్థాయి డీ గ్లామర్‌ పాత్రలో కనిపిస్తుంది. బిహారీ, పంజాబీ కలగలిపిన యాసలో మాట్లాడేందుకు శిక్షణ తీసుకుంది. ఇక కరీనా కపూర్‌ కాటుక తప్ప పెద్దగా మేకప్‌ వేసుకోలేదట. స్థానిక దుకాణాల్లో దొరికే సల్వార్‌ కుర్తాలనే వేసుకుందట. పంజాబీ స్టార్‌ దిల్జిత్‌ దొసాంజ్‌ ఈ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *