మిథాలీకి బీఎండబ్ల్యూ

మహిళా ప్రపంచకప్ పోటీల్లో కప్ ను జస్ట్ మిస్ చేసుకున్న మిథాలీ రాజ్ సేనపైన మన దేశంలో పొగడ్తల జల్లు కురుస్తూనే వున్నాయి. ఆట ముగిసి మూడు రోజులు కావస్తున్నా ఇంకా ట్విట్టర్లో #అంటూ టాప్ ప్లేసులో ట్రెండింగ్ నడుస్తూ వున్నదంటే పొగడ్తల జల్లు ఏ స్థాయిలో వున్నవో అర్థం చేసుకోవచ్చు.

మహిళల ప్రపంచకప్ లో ఫైనల్ చేరినందుకు భారత జట్టులోని ప్రతి ఒక్కరికీ రూ.50 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది బీసీసీఐ. ఇది గొప్ప నిర్ణయమంటూ అందరూ భారత బోర్డుపై ప్రశంసలు కురిపించారు. మహిళల జట్టు బీసీసీఐ గొడుకు కిందే ఉంది కాబట్టి వాళ్లకు బోర్డు నజరానా ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే అమ్మాయిల ఆటతో ఏ సంబంధం లేని ఓ వ్యక్తి.. భారత కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు ఇవ్వడానికి ముందుకొచ్చాడు.

ఆ వ్యక్తి మరెవరో కాదు చాముండీశ్వరీనాథ్. క్రీడాకారులతో అత్యంత సన్నిహితంగా వుండే చాముండేశ్వరీనాథ్ హైదరాబాదు బిగ్ షాట్లలో ఒకరుగా చెప్తారు. ఆయన ఇప్పుడు జట్టును ప్రపంచకప్ ఫైనల్ చేర్చిన మిథాలీకి రూ.40 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందజేయబోతున్నారు. విషయం ఏమిటంటే… ఆయన క్రీడాకారులకు స్ఫూర్తి నింపేందుకు ఇలా చేస్తుంటారు కానీ కొందరు ఆయన్ని పబ్లిసిటీ హీరో అంటూ సెటైర్లు వేస్తుంటారు.

ఏ ప్లేయర్ అయినా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటితే వెంటనే ఇలా నజరానాలు ప్రకటిస్తుంటారు. రియో ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన పి.వి.సింధు.. సాక్షి మాలిక్.. జిమ్నాస్టిక్స్ లో సాహసోపేత ప్రద్శన చేసిన దీపా మాలిక్ లకు కూడా బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చాడు చాముండి. ఇంకా చాలామంది క్రీడాకారులకు ఆయన కార్లు.. ఇతర బహుమతులు ఇచ్చాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *