ఎన్టీఆర్‌పై బాబుకు గౌరవం ఇదేనా..?

ఎన్టీఆర్ పై ఇప్పటికే పలుదఫాలుగా చంద్రబాబు నాయుడు మాట మార్చాడు. కాంగ్రెస్ లో ఉన్న రోజుల్లో.. అధిష్టానం ఆదేశిస్తే మామపై పోటీకి సై అన్నదీ చంద్రబాబు నాయుడే. కావాలంటే పాత పేపర్ క్లిప్పులున్నాయి. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ పంచన చేరి.. ఆయననే పచ్చి బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు అని.. దేవినేని నెహ్రూ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కేవలం ఎన్టీఆర్ నే గాక ఆయన తనయులను కూడా బాబు ఇష్టానుసారం తూలనాడాడు అని ఆ ఇంటర్వ్యూలో నెహ్రూ చెప్పాడు. ఇక ఎన్టీఆర్ ను పదవీభ్రష్టుడిని చేసి.. చంద్రబాబు నాయుడు సీఎం సీటును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పై ఇష్టానుసారం మాట్లాడాడు బాబు.

ఎన్టీఆర్ కు విలువల్లేవు అని ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు వ్యాఖ్యానించడం, ఆ తర్వాత ఎన్టీఆర్ అవసరం తమకు లేదని మరోసారి ఇంగ్లిష్ పత్రిక ఒక దానికి బాబు చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన పేపర్ క్లిప్ లు ఆన్ లైన్లో ఇప్పటికీ ఉన్నాయి.

ఇక అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం చంద్రబాబుకు మామ అవసరం ఏర్పడింది. వరస పెట్టి ఎన్టీఆర్ నామ స్మరణ జరిగింది. అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ వినిపించసాగాడు చంద్రబాబు. ఇక తీరా మళ్లీ అధికారం చేతికి అందాకా మాత్రం కేంద్రంతో మాట్లాడి ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ ను చేయలేకపోవడం బాబు తీరుకు నిదర్శనం.

ఇక ఈ మధ్యనే బాబుగారు చెప్పిన మాట.. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రమ్మన్నది తనే అనేది. ఆ మాట విని చాలా మంది నవ్వుకున్నారు. ఇక తాజ్ అప్డేట్ ఏమిటంటే.. ఎన్టీఆర్ కు నివాళి ఘటించడానికి చంద్రబాబు నాయుడు రాలేదు.  హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కువచ్చి నివాళులు అర్పించలేదు చంద్రబాబు నాయుడు. ఒకవైపు ఓటు బ్యాంకు రాజకీయం కోసం.. ఎన్టీఆర్ విషయంలో అవసరానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు..ఈ రోజు కొత్త రకంగా వ్యవహరించి మామపై తన కున్న గౌరవం ఏపాటితో చాటి చెప్పాడని కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

Videos

483 thoughts on “ఎన్టీఆర్‌పై బాబుకు గౌరవం ఇదేనా..?

Leave a Reply

Your email address will not be published.