జేపీ రాజ్యసభకు.. చంద్రబాబు ఓకే?

లోక్ సత్తా అధిపతి జయప్రకాష్ నారాయణ రాజ్యసభకు నామినేట్ కానున్నాడనే వార్త ఆసక్తిదాయకంగా మారింది. అది కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అనే మాట మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొన్నాళ్లుగా చంద్రబాబు నాయుడు అనుకూల టోన్ ను వినిపిస్తూ ఉన్నాడు జయప్రకాష్ నారాయణ. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు చంద్రబాబు ఆయనను కరుణించాడని.. రాజ్యసభ సభ్యత్వంతో తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తూ ఉంది.

త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ కోటాలోని రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండు సీట్లు దక్కనున్న విషయం తెలిసిందే. రేణుకా చౌదరి, చిరంజీవి, దేవేందర్ గౌడ్ ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేఫథ్యంలో.. వీరి స్థానంలో వేరు ముగ్గురు ఎన్నిక కానున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు దక్కనుంది. ఆ సీటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నామినేట్ చేయనుంది ఆ పార్టీ. ఇక తెలుగుదేశం పార్టీ కోటాలోని రెండు సీట్లలో ఒక అభ్యర్థిత్వం జేపీకి దక్కనుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది.

జేపీ కూడా రాజ్యసభకు వెళ్లే ఆసక్తితోనే ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసినా నెగ్గలేకపోయాడు ఆయన. అప్పుడు జేపీ అవకాశాలను దెబ్బతీసింది కూడా చంద్రబాబు అనే అంటారు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు సానుకూలంగా ఉన్నాడని.. జేపీని ఎంపీని చేయడానికి బాబు ఓకే చెప్పాడని టాక్. ఇటీవల జేఎఫ్‌సీ మీటింగుల్లో కూడా చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడాడు జేపీ. ఈ నేఫథ్యంలో.. బాబు మరింత హ్యాపీ అని, జేపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఖాయమే అని సమాచారం!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *