చంద్రబాబు వాడుకుని వదిలేసే టైపు అని తెలుసు: పవన్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై ఆసక్తిదాయకమైన కామెంట్లు చేశాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. విశాఖలో తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ ప్రసంగిస్తూ.. గత ఎన్నికల పరిణామాల గురించి సమీక్షలా మాట్లాడాడు. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమన్నాడంటే.. చంద్రబాబు నాయుడికి ఉన్న ఇమేజ్ గురించి ప్రస్తావించాడు.

రాజకీయాల్లో వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు ను మించిన వారు లేరనే అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశాడు. చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా ఎవరో ఒకరిని వాడుకోవడం… తర్వాత వారిని ఏదో విధంగా దెబ్బ కొట్టడం అనే నేపథ్యమే ఉందన్న విషయాన్ని పవన్ ప్రస్తావించాడు. అంతేగాక..  చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేసే తత్వం ఉన్న మనిషి అని తనకు తెలుసు అని పీకే వ్యాఖ్యానించడం గమనార్హం.

‘చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడు అని నన్ను చాలా మంది హెచ్చరించారు. నాకు తెలియదా?’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు. ఇక జనసేనతో సత్తా చాటతాం అని పీకే వ్యాఖ్యానించడం విశేషం. అంతేగాక.. అన్న చిరంజీవి గురించి కూడా పవన్ ప్రస్తావించాడు. ప్రజారాజ్యం పార్టీ ఓటమి తనను బాధించిందని చెప్పిన పవన్ కల్యాణ్.. మరో ఆసక్తిదాయకమైన పిలుపును ఇచ్చాడు. ప్రజారాజ్యం పార్టీని దెబ్బతీసిన వారిని ఇప్పుడు మనం దెబ్బతీద్దాం అని పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. తన పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తి నింపేలా పవన్ ప్రసంగం సాగింది.

Videos

200 thoughts on “చంద్రబాబు వాడుకుని వదిలేసే టైపు అని తెలుసు: పవన్

Leave a Reply

Your email address will not be published.