డ్రోన్లు ఎగరవేయడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు:చంద్రబాబు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఉంటున్న ఇంటిపై కొంతమంది ప్రవేటు వ్యక్తులు డ్రోన్ ని ఉపయోగించారు. దీనితో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరడంపై అధికారులను ఆయన నిలదీశారు. డ్రోన్లు ఎగరేస్తున్న వ్యక్తులెవరు?వారికి అనుమతులు ఎవరిచ్చారు? డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా డ్రోన్లు ఎగురవేయడానికి వీల్లేదు కదా? అని ప్రశ్నించారు. అన్ని అనుమతులతోనే డ్రోన్లు ఎగరేస్తున్నారా అని ప్రశ్నించారు. అయితే డ్రోన్ ఉపయోగించిన వారిని తెదేపా నాయకులు పట్టుకున్నారు. దీనితో అక్కడ ఉద్రికత చోటుచేసుకుంది. పోలీసులు కలుగచేసుకొని డ్రోన్ ఉపయోగించిన వారిని ఆడుపులోకి తీసుకున్నారు. జల వనరుల శాఖ వారి అనుమతితోనే డ్రోన్ ఉపయోగించినట్టు ప్రవేటు వ్యక్తులు చెప్పుతున్నారు. దీనితో స్పందించిన జనవనరుల శాఖ తామే డ్రోన్ విజువాల్స్ ని చిత్రీకరించామన్నట్లు తెలియజేశారు. ప్రస్తుత వరద పరిస్తితి తెలుసుకోవడం కోసం విజువల్స్ తీయమని చెప్పమని తెలియజేశారు.

Videos

One thought on “డ్రోన్లు ఎగరవేయడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు:చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published.