చంద్ర‌బాబును టెన్ష‌న్ పెడుతోన్న హ‌రికృష్ణ‌

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి చుక్కలు చూపేలానే ఉన్నాయి. ఓ వైపు లోక‌ల్ బాడీస్‌, ఎమ్మెల్యే కోటాలో అభ్య‌ర్థుల ఎంపిక చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఆశావాహుల లిస్ట్ చాలానే ఉంది. వీరిలో ఎవ‌రిని ఎంపిక చేయాలో తెలియ‌క చంద్ర‌బాబు స‌త‌మ‌త‌మ‌వుతుంటే ఇప్పుడు హ‌రికృష్ణ ఎంట్రీతో మ‌రో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. చంద్ర‌బాబు ఇప్ప‌టికే తన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఈ దఫా తప్పనిసరిగా మండలికి పంపాలని బాబు నిర్ణయించుకున్నారు.

ఇదిలా ఉంటే చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చంద్రబాబు బావ – పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ తాజాగా పొలిటిబ్యూరో స‌మావేశంలో ఎంట్రీ ఇచ్చారు. గ‌తంలో ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఛాన్స్ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించినా బాబు ఇవ్వ‌లేదు.

త‌ర్వాత చంద్ర‌బాబుపై ఆయ‌న ప‌లుసార్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అలాంటిది ఆయ‌న తాజా పొలిట్ బ్యూరో స‌మావేశంలో ఎంట్రీ ఇచ్చి అంద‌రికి బిగ్ షాక్ ఇచ్చారు. అసలు ఈ సమావేశానికి హరికృష్ణ వస్తారన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదట.

పొలిట్ బ్యూరో సభ్యుడి హోదాలో ఈ భేటీకి హ‌రికృష్ణ రావ‌డంతో ఆయ‌న కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారా ? అన్న సందేహాలు అంద‌రిలోను స్టార్ట్ అయ్యాయి. మ‌రి ఇప్పుడు హ‌రికృష్ణ ఎమ్మెల్సీ అడిగితే చంద్ర‌బాబు ఏం చేస్తారా ? అన్న డౌట్లే అంద‌రి మ‌దిలోను వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *