సత్యానాదెళ్ల ఫై చంద్రబాబు అన్నీ అబద్ధాలా..!

చంద్రబాబు నాయుడు తన డబ్బా కొట్టుకోవడానికి తరచుగా “సత్యా నాదెళ్ల’ ను ఉపయోగించుకొంటూ ఉంటాడు.ఈ తెలుగు వాడు తన వల్లనే మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యాడని బాబు ఇప్పటి వరకూ కొన్ని వేల సార్లు చెప్పుకున్నారు.

ఇంతకీ బాబు ఏం చెప్పారంటే… “మన రాష్ట్రంలో పుట్టాడు.. నాదెళ్ల సత్య, మన దగ్గర చదువుకున్నాడు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడేవాడిని… వాళ్ల తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండేవాడు. నా దగ్గర పని చేసే వాడు. ఆయన ఒకటే చెప్పాడు.. నేను ఫోన్ చేసి అభినందించాను .మీ అబ్బాయికి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చిందని. ఆయన చెప్పింది.. మామూలుగా అయితే ఐఏఎస్ ఆఫీసర్ గా వెళ్లేవాడు, మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు దాని వల్ల  ఆ చదువు చదివాడు.. చదివిన తర్వాత మైక్రోసాఫ్ట్ కు వెళ్లాడు.. ఈరోజు మైక్రోసాఫ్ట్ పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు..’’ ఇదీ చంద్రబాబు ప్రసంగ పాఠం… ఆయన మాటల్లోనే!

దీని సారాంశం ఏమనగా.. సత్య నాదెళ్ల తండ్రి ఐఏఎస్ అధికారి. బాబు దగ్గర పని చేసేవాడు. ఆయన తనయుడు సత్య మామూలుగా అయ్యుంటే ఐఏఎస్ చదువు చదివే వాడు. బాబు గారు అప్పటికే ఐటీని ప్రమోట్ చేశారు. దాని వల్ల ఐటీకి సంబంధించిన చదువును చదివి.. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ లో జాబు సంపాదించాడు.  ఆ సంస్థలోనే మంచి స్థాయికి ఎదిగాడు.

1992లోనే సత్య నాదేళ్ల మైక్రోసాఫ్టులో జాయిన్ అయ్యారని, కానీ బాబు మాత్రం తన వల్లే సత్య నాదెళ్ల ఐటీ చదివారని చెబుతున్నారని, ఆయన తీరు చూస్తే నవ్వొస్తుందన్నారు. 1995లో చంద్రబాబు సీఎం అయితే, సత్య అంతకుముందే అమెరికాలో స్థిరపడ్డారన్నారు. 1992లోనే ఆయన సన్ మైక్రో సిస్టమ్స్‌లో చేరారన్నారు. మరి చంద్రబాబు నుంచి ఆయన స్ఫూర్తి ఎక్కడ పొందినట్లు అని ప్రశ్నించారు. ప్రపంచానికే ఐటీని నేర్పానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇక యుగంధర్ గారు 86 నుంచి 88 వరకు ఏపీలో పని చేశారని, చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

ఆయన దగ్గర యుగంధర్ గారు ఎప్పుడు పని చేశారో చెప్పాలన్నారు. చెప్పేందుకైనా నమ్మశక్యం అయ్యే మాటలు ఉండాలన్నారు. చంద్రబాబు పాలనలో హైదరాబాద్ కంటే బెంగళురులోనే ఐటీ ఎక్కువగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అందరూ తనను చూసే స్ఫూర్తి పొందారని చెప్పుకునే బాబుకు.. మరి అలా ఆదర్సంగా తీసుకున్నామని ఎవరూ ఎందుకు చెప్పడం లేదన్నారు.

Videos

4 thoughts on “సత్యానాదెళ్ల ఫై చంద్రబాబు అన్నీ అబద్ధాలా..!

Leave a Reply

Your email address will not be published.