బాబు రిటైర్ అయ్యాక తిండి పెట్టేది వారేనట

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు. తరచూ మీడియాతో చాలా ఎక్కువగా మాట్లాడే ముఖ్యమంత్రి.. ఆసక్తికరమైన విషయాల్ని చాలా తక్కువగా చెబుతుంటారు. ఆయన మాటల్లో పస కంటే నస ఎక్కువన్న విమర్శను పలువురు చేస్తుంటారు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు ఆయన ప్రసంగం కాస్త మెరుగు పడిందంటున్నారు.

ఈ మధ్య అపుడపుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతున్నారు చంద్రబాబు. మనవడు – ఇద్దరు పిల్లలు – పర్యావరణం… వంటివి ఈ మధ్య ఆయన మాటల్లో పేలాయి. తాజాగా సీఎం చంద్రబాబు మాటల్లో ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని చెప్పారు.

ఇందుకు సంబంధించి తన కుటుంబాన్ని ఒక ఉదాహరణగా చెబుతున్నారు. సాధారణంగా పొలిటీషియన్ల ఫ్యామిలీల్లో పిల్లలు సరిగా చదువుకోరని.. కానీ తాను అలా అనుకోలేదన్నారు. బాగా చదివించాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ను స్టాన్ ఫోర్డ్ లో చదివించినట్లుగా చెప్పారు. తమ ఇంట్లో ఇప్పుడు నలుగురిలో అందరూ ఉన్నత విద్యావంతులేనని.. తన కొడుకు.. కోడలు బాగా చదువుకున్నారన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక నా కొడుకు.. కోడలు తిండి పెడతారన్నారు. వారు బాగా చదువుకొని.. సంపాదిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు సరదాగా చెప్పేశారు. ఆయన అలా చెప్పినా.. చదువు ప్రాధాన్యం గురించి చెప్పారని చెప్పాలి. బాబు చెప్పినట్లుగా ఎంతమంది రాజకీయ నేతల కుటుంబాల్లో బాగా చదువుకున్న వారు ఉంటున్నారు?

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *