చంద్రబాబు ఆ టీడీపీ నేతను నమ్మడం లేదు..!

మొత్తానికి శిల్పా చక్రపాణి రెడ్డికి చంద్రబాబు వరస షాకులనే ఇస్తున్నారు. మొన్నటి వరకూ ఆయనను చాలానే గౌరవించారు చంద్రబాబు. ఎమ్మెల్సీగా నెగ్గుకొచ్చిన ఆయనను మండలి చైర్మన్ గా చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. శిల్పా చక్రపాణిపై అలా గౌరవమర్యాదలు చూపిన తెలుగుదేశం అధినేత ఇప్పుడు మాత్రం ఆయనను పూర్తిగా పక్కన పెట్టేయడం కొసమెరుపు. మండలి చైర్మన్ గా చేస్తామని హామీని ఇచ్చిన వ్యక్తిని ఇప్పుడు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేశారు. నిన్నటి ఇఫ్తార్ విందులో చక్రపాణి రెడ్డికి కాస్తంతైనా ప్రాధాన్యత దక్కలేదు.

ఫ్లెక్సీల్లో కానీ, బాబు ప్రసంగంలో కానీ.. శిల్పా చక్రపాణి రెడ్డి ప్రస్తావన లేదు. మరి దీనికంతటికీ కారణం ఏమిటో అర్థం చేసుకోవడం కష్టం కాదు. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడటంతోనే చక్రపాణి రెడ్డిని పట్టించుకోవడం మానేశాడు చంద్రబాబు. శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడకుండా ఉండేందుకు చక్రపాణి రెడ్డిని ఉపయోగించజూశాడు బాబు. మోహన్ రెడ్డి పార్టీని వీడకుంటే.. చక్రపాణి రెడ్డికి పదవిని ఇస్తామనే ఆఫర్ ను ప్రకటించారు. అది కూడా మండలి చైర్మన్ పదవి.

అయితే.. బాబు హామీలకు ఫలితం దక్కలేదు. మోహన్ రెడ్డి తన దారితను చూసుకున్నాడు. దీంతో చక్రపాణి రెడ్డికి షడన్ గా ప్రాధాన్యతను తగ్గించేస్తున్నారు చంద్రన్న. నంద్యాల ఉప ఎన్నికలు జరగబోతున్నా కూడా ఆ నియోజకవర్గం నేత అయిన చక్రపాణి రెడ్డికి వరస అవమానాలే మిగులుతున్నాయి. తను తెలుగుదేశంలోనే ఉంటానని చెప్పినా చక్రపాణి రెడ్డిని పట్టించుకునేలా లేరు చంద్రబాబు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *