ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధిస్తే.. నోబెల్ బహుమతి..చంద్రబాబుకేమైంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేషమైన రాజకీయానుభవం కలిగిన నాయకుడు. మాట తొట్రుపడేది కాదు. ఈ విషయం సీనియర్ తెలుగు జర్నలిస్టులందరికీ తెలుసు. కానీ ఇటీవలి కాలంలో ఆయన పొంతన లేని వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విజయ పరిజ్ఞానం కూడా లేనట్లుగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన చేసిన ప్రకటనపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలను సంధిస్తున్నారు. ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ బహుమతి ఇస్తానంటూ ఆయన బుధవారం అన్నారు.

చంద్రబాబు ఆ మాట ఎందుకన్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ముఖ్యమంత్రిగా విశేషమైన అనుభవం ఉన్న ఆయనకు ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా మాట్లాడారా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి. నిస్పృహతో ఆయన వేగిపోతున్నారా, అందుకే ఆలా మాట్లాడుతున్నారా అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

అమరావతిలో 2018లో ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తానని చంద్రబాబు గతంలో ఓసారి ప్రకటించారు. నిజానికి నాలుగేళ్లకు ఓసారి జరిగే ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించాలనే విషయాన్ని ఎనిమిదేళ్ల ముందే నిర్ణయిస్తారు. ఒలింపిక్స్ నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటితో రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధమైన సంబంధం ఉండదు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలతో కూడిన వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి.

నోబెల్ బహుమతి తీసుకుని వస్తే తాను రూ.100 కోట్లు ఇస్తానని తిరుపతి సైన్స్ కాంగ్రెసులో చంద్రబాబు అన్నారు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విశ్వవిద్యాలయాల్లో కనీస వసతులు కూడా కూడా కల్పించకుండా వంద కోట్ల రూపాయలు ఇస్తానని అనడాన్ని నెటిజన్లు తప్పు పట్టారు.

Videos

168 thoughts on “ఒలింపిక్ క్రీడల్లో విజయం సాధిస్తే.. నోబెల్ బహుమతి..చంద్రబాబుకేమైంది?

Leave a Reply

Your email address will not be published.