చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ పవన్‌కళ్యాణ్‌

పవన్‌కళ్యాణ్‌ రూటే సెపరేటు. తెరపై ఎంత మోడ్రన్‌ లుక్‌తో కన్పించినా, ఎంత స్టైలిష్‌గా సందడి చేసినా, రియల్‌ లైఫ్‌లో మాత్రం అందరికీ షాకిచ్చే గెటప్స్‌లో కన్పిస్తుంటారాయన. అందుకే, పవన్‌కళ్యాణ్‌ని కొందరు ‘పవన్‌ బాబా’ అని కూడా పిలుస్తుంటారు. ఆయన డ్రెస్సింగ్‌ అలా వుంటుంది మరి.!

తెల్ల పంచెలో పవన్‌కళ్యాణ్‌ కన్పించడం చాలా సాధారణమైన విషయం. ఆ డ్రెస్సింగ్‌ని ఆయన బాగా ఇష్టపడ్తారు కూడా. ఖద్దరు దుస్తులు వేసుకోవడం పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు కొత్తగా చేస్తున్నదేమీ కాదు. అయితే, ఇప్పుడు ఏకంగా ఖద్దరుకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోనున్నారు పవన్‌కళ్యాణ్‌. చేనేత కార్మికులకు అండగా వుంటాననీ, వారు త్వరలో చేపట్టబోయే ధర్నాకి మద్దతిస్తాననీ తనను కలిసిన చేనేత సంఘాల నేతలకు తెలిపిన పవన్‌, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండేందుకు అంగీకరించడం గమనార్హం.

అన్నట్టు, తన తాజా చిత్రం ‘కాటమరాయుడు’లో పవన్‌కళ్యాణ్‌, చేనేత దుస్తుల్లోనే కన్పించనున్నారు. దీనికి సంబంధించిన స్టిల్స్‌ ఇప్పటికే విడుదలై అభిమానుల్ని అలరిస్తున్నాయి. చేనేత కార్మికుల సమస్యలపై గళం విప్పడం ద్వారా పొలిటికల్‌ మైలేజ్‌ సంపాదించడం, అదే సమయంలో.. తన తాజా చిత్రం ‘కాటమరాయుడు’కి ఈ ‘చేనేత’ బ్రాండ్‌తో కొత్త గ్లామర్‌ తీసుకురావడం.. అబ్బో, పవన్‌కళ్యాణ్‌కి అన్నీ భలేగా కలిసొచ్చేస్తున్నట్టున్నాయ్‌.!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *