పవన్ గురించి మాట్లాడను – బన్నీ

ఇండస్ట్రీ ఎందర్నో చూసేసింది..అది సినిమా నటులే కావచ్చు..సాంకేతిక నిపుణలే కావచ్చు..ఆఖరికి మీడియా జనాలే కావచ్చు..ప్రతి ఒక్కరి టైమ్ వస్తుంది…వెళ్తుంది..కానీ టైమ్ వచ్చింది కదా, అని మాటల విషయంలో కాస్త జాగ్రత్త పడకపోతే, కొంచెం ఇబ్బందే.

సక్సెస్ మీట్ లో పవన్ గురించి అడిగారు..చెప్పను బ్రదర్ అన్నారు ఓకె. నిజానికి అది కూడా సరైన మాట కాదు. ఇప్పుడు, ఇక్కడ కాదు..తరువాత మాట్లాడదాం అనేస్తే పోయేది. కానీ అలా అనలేదు. అక్కడ ఫ్యాన్స్ తప్పు కూడా వుంది కాబట్టి ఓకె. కానీ పాపులర్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చినపుడన్నా,  ఏదో మాట చెప్పి తప్పించుకోవాలి. లేదా ఎందుకు పవన్ గురించి మాట్లాడను అన్నది క్లియర్ గా చెప్పాలి. లేదా తనకు పవన్ గురించి మాట్లాడడం నచ్చదు అని కుండ బద్దలు కొట్టాలి. అలా కాకుండా, ఇలా అంటే జనం, సినిమా సక్సెస్ బన్నీని ఎక్కడికో తీసుకుపోయింది అని అనుకునే ప్రమాదం వుంది.

ఇప్పటికే ”..కావాల్సింది బ్రాండ్ కాదు..దమ్ము..” అని ఫ్యామిలీ నేమ్ లు చెప్పుకునే హీరోలపై ఓ మాట విసిరాడు బన్నీ. నిజానికి బన్నీ వచ్చింది కూడా ఆ బ్రాండ్ నేమ్ తోనే. అల్లు అనే ఫ్యామిలీ బ్యాక్ గ్రవుండ్ లేకుంటే..? మెగాభిమానులు అనేవారు లేకుంటే..అందువల్ల పవన్ అంటే అల్లు ఫ్యామిలీకి బేధాభిప్రాయాలు వుంటే వుండొచ్చు. కానీ వాటిని ఇంత ఓపెన్ గా డిస్కషన్ కు వచ్చేలా మాట్లాడడం మాత్రం సరైన పని కాదన్నది సినిమా అభిమానుల మాట.

ఇదిలా వుంటే పాపులర్ మీడియాలో, పవన్ గురించి మాట్లాడను, అది తప్ప ఇంకేదైనా అడగండి అని బన్నీ అన్నాడన్న విషయం పైకి రాగానే అల్లు అరవింద్ కలవరపడ్డట్టు వార్తలు వినవస్తున్నాయి. అసలు బన్నీ ఆ మాటే అనలేదని ప్రచారం చేయాలని అనుకున్నారని వినికిడి. అయితే ఇంటర్వూ చేసిన వాళ్ల దగ్గర అడియో రికార్డింగ్ వుందని తెలిసి, సైలెంట్ అయ్యారట. అయితే డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలని కిందా మీదా అవుతున్నారట. అవసరం అయితే బన్నీ చేత ప్రెస్ మీట్ పెట్టించి, అన్ని విషయాలపై వివరణ ఇప్పించాలని ఆలోచిస్తున్నారట.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *