చైనాలో 4వేల అశ్లీల వెబ్‌సైట్లు తొలగింపు..

ప్రజలను తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్లపై డ్రాగన్‌ చైనా కొరడా ఝళిపించింది. అశ్లీల, అసభ్య సమాచారంతో లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రసారాలను చేస్తున్న సుమారు 4వేలకు పైగా వెబ్‌సైట్లను చైనా ప్రభుత్వం తొలగించింది. సైబర్‌స్పేస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 4వేలకు పైగా వెబ్‌సైట్లను చైనా ప్రభుత్వం తొలగించినట్లు జిన్ హువా న్యూస్ ఏజెన్సీ ఓ కథనంలో వెల్లడించింది. లైవ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లలో అసభ్య పదజాలంతో ఉన్న కంటెంట్ సామాజిక భద్రతకు విఘాతం కలిగించటమేకాక, సమాజంలో స్తిరత్వాన్ని దెబ్బతీస్తుందని సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రచురించిన కథనంలో పేర్కొంది. దీనిపై స్పందించిన చైనా ప్రభుత్వం ఈ మేరకు 4వేలకుపైగా లైమ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *