చింతమనేని ప్రభాకర్ అరెస్టు…

chintamaneni prabhakar
chintamaneni prabhakar

దళితులని దూషించిన కేసులో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనితో ఆయన 12 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. బుధవారం ఆయన భార్యకు ఆరోగ్యం బలేకపోవడంతో ఆమెను చూసేందుకు దుగ్గిరాలాలోని తన నివాసానికి వచ్చారు. దీనితో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే చింతమనేని అరెస్టు ను అడ్డుకునేందుకు ఆయన అనుచరులు, టి‌డి‌పి కార్యకర్తలు ప్రయత్నించారు. దీనితో కాసేపు హైడ్రామా నడిచింది. అంతకుముందు. బుధవారం ఉదయం చింతమనేని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన అనుచరులు పోలీసులను అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. చింతమనేని లొంగిపోతారని చెప్పినా ఎందుకు సోదాలంటూ అనుచరులు నిలదీశారు.

Videos