ఎన్టీఆర్ పొమ్మన్నాడు…చిరంజీవి రమ్మన్నాడు

ప్ర‌స్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సాంగ్‌.. అమ్మ‌డు లెట్స్ డూ కుమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి కాజల్ తో కలిసి స్టెప్పులేసిన ఈ పాట‌పై ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. అదే ఇప్పుడు నందమూరి,మెగా అభిమానుల్లో సంచ‌ల‌నంగా మారుతోంది.

ఈ పాట ట్యూన్‌ని మొద‌ట దేవి శ్రీ ప్ర‌సాద్ ఎన్టీఆర్ కి వినిపించాడ‌ట‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ ఐటెం పాట కోసం దేవి శ్రీ ఈ ట్యూన్‌ని కంపోజ్ చేసాడట. ఆ ట్యూన్‌ని తార‌క్‌కి వినిపించాడట. కానీ తార‌క్‌ మాత్రం ఆ ట్యూన్ కి అంత‌గా ఇంప్రెస్ కాలేద‌ట‌. అదే బాణీ కొర‌టాలకు బాగా న‌చ్చ‌డంతో ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన, తార‌క్‌కి ఆ ట్యూన్ నచ్చక పోవడంతో కొర‌టాల కూడా నో చెప్పాల్సి వ‌చ్చింద‌ట‌.

 తాజాగా చిరు ఖైదీ నెంబ‌ర్ 150 కోసం అదే ట్యూన్‌ని వినిపించాడ‌ట దేవి. ఆ ట్యూన్ వినగానే వెంటనే చిరంజీవి ఓకే చేసేశార‌ట‌. అలా ఆ పాట ఇప్పుడు మెగాస్టార్ ఖాతాలో మార్మోగుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 5మిలియ‌న్‌లు అంటే 50ల‌క్ష‌ల వ్యూస్ ద‌క్కించుకొని దూసుకుపోతోంది.
 అయితే, ఈ రెండు పాట‌ల‌లోనూ ముద్దుగుమ్మ కాజలే మెగాస్టార్,యంగ్ టైగర్ తో జత కట్టడం చెయ్య‌డం విశేషం.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *