ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్

చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా జూ ఎన్టీఆర్ అవార్డ్ అందుకోవటం ఆసక్తికరంగా ఉంది కదూ. అయితే ఈ ఇంట్రస్టింగ్ సంఘటన నిన్న మా సిని అవార్డ్ ల పంక్షన్ లో జరిగింది. నిన్న (ఆదివారం)రాత్రి ఈ పంక్షన్ హైదరాబాద్ లో హైఐసిసిలో ఘనంగా జరింది.

సైమా – ఫిలింఫేర్ – మా అవార్డులకు గాను.. నామినేషన్స్ పరిశీలిస్తే.. ప్రభాస్ (బాహుబలి) – మహేష్ (శ్రీమంతుడు) – నాని(భలే భలే మగాడివోయ్) – వరుణ్ తేజ్(కంచె) – ఎన్టీఆర్(టెంపర్) – అల్లు అర్జున్(రుద్రమదేవి) ఉన్నాయి. సైమా అసలు ఎన్టీఆర్ ని నామినేట్ చేయలేదు. సినీ’మా’ అవార్డుల్లో మాత్రం ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. బాహుబలి మంచి పెద్ద కాన్వాస్ ఉన్న చిత్రం. ఇక శ్రీమంతుడు అయితే.. యాక్షన్ కంటే కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. భలే భలే మగాడివోయ్ లో నాని.. ఎప్పుడూ చేసే కామెడీనే చేసి చూపించాడు. వరుణ్ తేజ్ కంచె కూడా కాన్సెప్ట్ ఓరియెంటెడ్. రుద్రమదేవిలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నా.. ఇది పూర్తి స్థాయి పాత్ర కాదు.

టెంపర్ చిత్రంలో అద్బుతమైన నటన చేసిందందుకు కానూ..ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. దాందో అవార్డ్ ట్రోపిని చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్టీఆర్ ఈ అవార్డ్ అందుకుంటూ చాలా హ్యాపీ ఫీలయ్యారు.

అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్ మాట్లాడుతూ…తన తాతగారైన ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నిరంతరం తనను ఇన్సిప్రేషన్ గా ఉంటూ ప్రేరేపిస్తారని అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published.