హీరోయిన్ తో చిరు కుమ్ముడు ఏ స్దాయిలో ఉందో చూడండి (వీడియో)

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. ఈ చిత్రంలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అనే పాటను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆదివారం విడుదలైన ఈ పాటను ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 36 లక్షల మందికిపైగా చూసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ పాట మేకింగ్‌ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్‌ పాడారు. ఈ మేకింగ్ వీడియోలో చిరు కుమ్ముడుని చూడవచ్చు.

ఎర్ర‌చొక్కాని నీకోసం వేశాను..
స‌ర్రుమంటూ ఫారిన్ సెంటే కొట్టాను..
గ‌ళ్ల లుంగీని ట్రెండీగా క‌ట్టాను..
క‌ళ్ల జోడెట్టి నీకోసం వ‌చ్చాను ..
అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు”

“ఎర్ర చీరేమో ఈరోజే కొన్నాను..
న‌ల్ల జాకెట్టు నైటంతా కొట్టాను..
వాలు జెళ్లోనా మందారం పెట్టాను..
క‌న్నె ఒళ్లంతా సింగారం చుట్టాను..
అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు”

దేవీ మ్యూజిక్ కుమ్ముడే కుమ్ముడు. చిరు బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ చ‌క్క‌ని మాస్ బీట్ ఇది. ఈ బీట్ వింటే ఏమ‌నిపిస్తోంది. చిరు – దేవీశ్రీ కుమ్ముడే కుమ్ముడు అనిపించ‌డం లేదూ? సంక్రాంతి బరిలో బాస్ వ‌చ్చేస్తున్నారు కాబ‌ట్టి అప్పుడు అస‌లు కుమ్ముడేంటో చూడాలి.’ఖైదీ నంబర్‌ 150′ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయ్‌లక్ష్మీ ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *