ఏపీలో పెట్టుబడులకు అపార అవకశాలు:జగన్

 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి రహిత పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విదేశాంగ శాఖ సహకారంతో విదేశీ రాయబారులతో అమరావతిలో నిర్వహించిన పరస్పర అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 35 దేశాల నుంచి దౌత్యవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యారు

రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు లేకపోవడం ఏపీకి ఇబ్బందికరమే అయినప్పటికీ మాకు 970 కిలోమీటర్ల కోస్టల్‌ లైన్‌, నాలుగు ఓడ రేవులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది మా బలం. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా మాకున్నాయి విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. అయితే విద్యుత్‌ పంపిణీ సంస్థలను రక్షించుకోవాలంటే ఇది తప్పదని వివరించారు. ఒప్పందం కుదుర్చుకున్న వాటిలో అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నట్లు తెలిపారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించటం అనే మరో నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమలు అక్కడి స్ధానిక యువత కు ఉపాధి కల్పించకపోతే ఎలా? ఉద్యోగ అవకాశాలు లేకపోతే ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది? పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఎలా ఇస్తారాణి అన్నారు. పెట్టే పరిశ్రమల్లో కావాల్సిన అర్హతలు తెలుసుకుని ఉద్యోగాల కోసం స్థానికంగా ఉండే ఇంజినీరింగ్ కళాశాలలో నైపుణ్యం శిక్షణ ఇప్పిస్తాం.

కాఫీ, ఆక్వా ఉత్పత్తలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ఎగుమతులు పెరగాల్సి ఉందని తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 62 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారు. అందుకే విద్య, వైద్య, వ్యవసాయం కోసం ప్రత్యేక పథకాలను రూపొందిస్తున్నామని అన్నారు. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానానికి సహకారం కావాలి. డీజిల్‌ బస్సులను తీసేసి ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడతాం. విశాఖపట్నంకు మెట్రో రాబోతుంది. మేం పారదర్శక, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఖచ్చితంగా చెప్తున్నామని విజయవాడ, గుంటూరుకు కూడా మెట్రో వస్తుందని తెలిపారు. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *