కొబ్బరి నీళ్లు బాటిల్‌లోకి మారుస్తున్నారా..? జాగ్రత్త

వేసవిలో ఉపశమనం, ఆరోగ్యం కోసం కొబ్బరినీళ్లు దివ్వౌషధం. ఇటీవల కొబ్బరి నీళ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతీ కాలనీలో రెండు కంటే ఎక్కువ కొబ్బరిబొండాల దుకాణాలు కన్పిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అందరూ సూచిస్తున్నట్లు కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి మందిదే. కానీ, వాటిని అలా బొండంలో నుంచి నేరుగా తాగితేనే మంచిదనే విషయాన్ని గుర్తించాలి. చాలా మంది ఆరోగ్యానికి మంచిదికదా అని కొబ్బరి నీళ్లలో బాటిళ్లలో నింపుకొని తీసుకెళ్తుంటారు. ఇలా ప్లాస్టిక్‌ బాటిళ్లలో కొబ్బరినీళ్లు తీసుకెళ్లడం వల్ల లాభం సంగతి పక్కన పెడితే.. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎందుకంటే, కొబ్బరి బొండం దుకాణాల్లో నీరు తీసుకెళ్లడానికి ఉపయోగిస్తున్న బాటిల్స్‌ ఫుడ్‌ గ్రేడ్‌ బాటిల్స్‌ కాదు. పైగా వాటిని నింపేట్పడు ఉపయోగిస్తున్న గరాటాలను ఆరు బయట అలాగే వదిలి వేస్తున్నారు. దుమ్ము, ధూళి వాటి మీద చేరడంతోపాటుగా ఈగలు సైతం వాలడంతో బ్యాక్టీరియా చేరి.. అందులోని నీరు తాగితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి.
బాటిళ్లలో నీరు తీసుకెళ్లడం ఆర్థికంగా నష్టమనే విషయాన్ని గుర్తించాలి. కొబ్బరి బొండాల వద్ద అమ్ముడవుతున్న బాటిల్స్‌లో చాలా వరకూ లీటరు పరిమాణంలో ఉండటం లేదు. కనీసం 100 -150 మిల్లీ లీటర్లు తక్కువ పరిమాణంలో ఈ బాటిల్స్‌ ఉంటున్నాయి. అంతేనా.. సాధారణంగా ఈ బాటిల్స్‌ నింపేటప్పుడు కొబ్బరి బొండాలు కొట్టే వ్యక్తి తన దగ్గర ఉన్న చిన్న కాయలు మరీ ముఖ్యంగా నిల్వ కాయలు ఏరికోరి కొడుతుంటాడు. సాధారణంగా రెండు మూడు కొబ్బరికాయలకు బాటిల్‌ ఫుల్‌ అవుతుందేమో. కానీ ఈ చిన్నకాయలు 8-9 కొడితే తప్ప బాటిల్‌ నిండదు. అందంతా చూచి బాటిల్‌ కొనుక్కున్న వ్యక్తికి తాను ఎక్కువ ఖర్చుపెట్టలేదన్న ఆత్మసంతృప్తి ఉంటుందేమో కానీ కొబ్బరి నీళ్లలో రుచి మాత్రం పొందలేడు. ఎందుకంటే.. కొబ్బరి బొండాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. సో.. ఇకపై కొబ్బరి నీళ్లుతాగేటప్పుడు తాజాకాయల కోసం వెతకండి. బాటిల్‌లో కొబ్బరినీళ్లు కావాల్సి వస్తే ఇంటిదగ్గర నుంచి మీరే బాటిల్‌ పట్టుకుని వెళ్లండి. ఏదైనా లీటరే కదా..! పైగా పర్యావరణానికీ కాస్త మేలు జరుగుతుంది..!! అన్నట్లు రెండు గంటల లోపే ఈ కొబ్బరి నీళ్లు తాగండి. ఆ తర్వాత ఇవి నిల్వ ఉండవు సుమా!
Videos

4,573 thoughts on “కొబ్బరి నీళ్లు బాటిల్‌లోకి మారుస్తున్నారా..? జాగ్రత్త