భారత టెకీలకు ‘కాగ్నిజెంట్‌’ షాక్

హెచ్‌1బీ వీసాల‌ను త‌గ్గించాల‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు భార‌తీయ టెకీల‌కు ద‌డ‌పుట్టిస్తున్న‌ది. ఇప్ప‌టికే దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్ వేలాది మంది అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇన్ఫోసిస్ త‌ర‌హాలోనే అమెరికా సంస్థ కాగ్నిజెంట్ అడుగులు వేయ‌నున్న‌ది. డిజిట‌ల్ టెక్నాల‌జీలో అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ సంస్థ అత్యంత పెద్ద‌ది. ప్ర‌స్తుత క్వార్ట‌ర్‌లో కాగ్నిజెంట్ సొల్యూష‌న్స్ లిమిటెడ్ భారీ స్థాయిలో లాభాలను చ‌విచూసింది.

ఆ సంస్థ‌కు ఒక్క అమెరికా నుంచే దాదాపు 75 శాతం ప్రాఫిట్స్ వ‌స్తున్నాయి. కాగ్నిజెంట్ కంపెనీలో సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భార‌తీయులు ఉద్యోగం చేస్తున్నారు. నైపుణ్యం ఉన్న స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని ట్రంప్ పిలుపు ఇవ్వ‌డంతో ఇప్పుడు కాగ్నిజెంట్ స్థానికుల‌నే ఎంపిక చేసేందుకు సిద్ధ‌మైంది. అమెరిక‌న్ల‌కు ఎక్కువ ఉద్యోగాలు క‌ల్పించి, హెచ్‌1బీ వీసాల‌ను త‌గ్గించాల‌ని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ అధ్య‌క్షుడు రాజీవ్ మెహ‌తా తెలిపారు. గ‌త ఏడాదితో పోలిస్తే , ఈసారి సగం మందికే వీసా ద‌ర‌ఖాస్తు చేసిన‌ట్లు మెహ‌తా చెప్పారు. ట్రంప్ వీసా విధానాల వ‌ల్ల భార‌త టెకీల‌కు మ‌రిన్ని స‌మ‌స్య‌లు త‌ప్పేట‌ట్టు లేదు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *