క్రికెటర్ షమి అరెస్టు పై స్టే..

భారత క్రికెటర్ మహ్మద్ షమి అరెస్టు పై పశ్చిమ బెంగాల్ లోని అలిపోర్ న్యాయస్థానం స్టే విధించింది. న్యాయస్థానం రెండు నెలల పాటు స్టే విధించిందని షమి తరపు న్యాయవాది సలీం రెహ్మాన్ తెలిపారు.  గృహ హింస కేసులో షమిపై అరెస్టు వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ నుండి వచ్చిన తర్వాత 15 రోజులలోపు లొంగి పోవాలని షమికి కోర్టు ఆదేశించింది. షమి భార్య హాసిన్ జహాన్ గత ఏడాది అతనిపై కేసు పెట్టింది. అప్పటి నుండి షమి న్యాయస్థానం ముందు హాజరు కాలేదు. దీంతో అతనిపై కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 2నా జరుగుతుందని షమి తరపు న్యాయవాది తెలిపారు.

Videos