వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని చంద్రబాబుకు నోటీసులు

అమరావతిలో చంద్రబాబు ఉన్న ఇంటికి మరోసారి అధికారులు నోటీసులు అందించారు. చంద్రబాబు ఉంటున్న ఇంటి గోడకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అతికించారు. లింగమనేని పేరుతో సీఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. వారంలోగా చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించారు. లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. గతంలో ఇచ్చిన నోటీసుల వివరాల్ని కూడా ప్రస్తుతం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్, స్విమ్మింగ్ ఫూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు. దీంతో చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని నిర్ధారణకు వచ్చామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటిని శుక్రవారం సాయంత్రం నోటీసులు అంటించారు. అయితే కరకట్ట వెంబడి ఇళ్లు నిర్మించికున్న మిగిలినవాళ్లు మాత్రం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. సీఆర్డీయే చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు.

Videos