దీపికా గిఫ్ట్‌ ఖరీదు 40 కోట్లు..ఎవరి కోసం?

ప్రపంచంలోని అత్యధిక మొత్తంలో పారితోషికం అందుకునే నటిగా టాప్‌లో 10 లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ భామ దీపికా పదుకునే, ఓ ఖరీదైన గిప్ట్ను కొనుగోలు చేసింది. ఆ గిప్ట్ను తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి త్వరలోనే బహుకరించబోతుందట. ఆ ఖరీదైన గిప్ట్ ఏమిటో తెలుసా? దక్షిణ ముంబాయిలో రూ.40 కోట్ల విలువ చేసే ఓ ఫ్లాట్. ప్రభా దేవీ ప్రాంతానికి సమీపంలో ఓ టవర్లో ఇటీవలె 16 కోట్లతో నాలుగు బెడ్రూంల హౌస్ కొనుక్కున్న ఈ భామ, అదే టవర్లో మరో ఫ్లాట్ను బుక్ చేసుకుంది. తన జీవితంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తికి ఈ ఫ్లాట్ను గిప్ట్గా ఇవ్వబోతున్నానని తెలియజేయడంతో,,,ఎవరా వ్యక్తి అని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

దీపికా ఫ్యాన్స్ మాత్రం తన తండ్రి ప్రకాశ్ పదుకునే కోసమే ఈ ఫ్లాట్ బుక్ చేసిందని అంటున్నారు. ఈ ఖరీదైన ఫ్లాట్ను తన పేరెంట్స్కు గిప్ట్ ఇవ్వగానే, వారు కుడా ముంబాయికి సిప్ట్ అయిపోతారని పేర్కొంటున్నారు. తను నివసించే టవర్లోనే దీపికా ఈ ఫ్లాట్ బుక్ చేయడంతో, ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర నివసించనున్నట్టు తెలుస్తోంది.

థ్రిపుల్ ఎక్స్‌ రిటర్స్,,సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దీపికా,,ఈ మూవీతో అక్కడ కూడా తన సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది. జనవరి నెలలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్‌ లో మాత్రం ప్రజెంట్‌ పద్మావతి సినిమా చేస్తోంది. ఇందులో దీపికాదే లీడ్ రోల్‌. దీంతో ఈ సినిమాతో బాలీవుడ్‌లో మరింత ఇమేజ్ సంపాదించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

బాలీవుడ్‌ మోస్ట్ వాటెండ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న దీపికా,,ప్రజెంట్ ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటు ప్రజెంట్ బాలీవుడ్‌ హైయ్యేస్ట్ పెయిడ్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. వీటితో పాటు వివిధ ప్రకటనలకు బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తూ.. రెండు చేతులతో సంపాదిస్తూ..ప్రపంచలో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా టాప్ 10లో నిలిచింది.నిన్నటి వరకు హీరో రన్‌వీర్ సింగ్ తో ప్రేమలో ఉన్న దీపికా..రీసెంట్‌గా రన్‌వీర్‌కు బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published.