వీడియో: సోంగ కార్చుకుని సినిమా చూస్తే ఉద్యోగం ఊడింది

ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అని ఒంటి మీద భయం లేకుండా హాయిగా కంప్యూటర్లో సినిమా చూసున్న వ్యక్తి ఉద్యోగం ఊడింది. ఉప ముఖ్య మంత్రి (డిప్యూటీ సీఎం) తనిఖీలకు వచ్చినా ఆ వ్యక్తి ఆ విషయం గుర్తించకుండా సినిమా చూశాడు. ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి కార్యాలయాన్ని ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బయట రోగులు వేచి ఉన్న విషయం గుర్తించారు. కార్యాలయంలో ఉద్యోగులు ఏం చేస్తున్నారు అని పరిశీలించడానికి లోపలికి వెళ్లారు.

ఓ ఉద్యోగి దర్జాగా కంప్యూటర్ ముందు ఖర్చుని సినిమా చూస్తున్న విషయం డిప్యూటీ సీఎం సిసోడియా గుర్తించారు. తరువాత గది లోపలికి వెళ్లారు. డీప్యూటీ సీఎం సిసోడియా గదిలోకి వచ్చిన విషయం ఆ ఉద్యోగి గుర్తించలేదు. చివరికి సిసోడియా ఆ ఉద్యోగి భుజం తట్టారు. పైకి లేచిన ఆ ఉద్యోగి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు.

ఇక్కడ ఇన్ చార్జీ ఎవరు, ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్లు పెట్టింది సినిమాలు చూడటానికా ? అని ప్రశ్నించారు. నీవు సినిమాలు చూడాలంటే ఇంటికి వెళ్లి చూడాలని, ఇక్కడ కాదని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చెయ్యడానికి పనికిరాడని చెప్పి వెంటనే అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తన ఫేస్ బుక్ లో ఈ వీడియోను పోస్టు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న సిసోడియా ‘ఇక్కడ ఇన్‌చార్జి ఎవరు? సినిమాలు చూడటానికి ఇక్కడికి వచ్చావా? ఆఫీసులో కంప్యూటర్లు సినిమాలు చూసేందుకు పెట్టారనుకున్నావా? సినిమాలు చూడాలని ఉంటే ఇంటికెళ్లి చూస్కో’ అంటూ ఘటుగా వార్నింగ్‌ ఇచ్చారు. వెంటనే ఆ ఉద్యోగిని కొలువులో నుంచి తీసేశారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *