చంద్ర‌బాబు ద‌గ్గ‌ర దేవినేని ఉమాకు ఘోర అవ‌మానం

ఏపీ మంత్రి.. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు సాక్షాత్తు సీఎం చంద్ర‌బాబు వ‌ద్దే ఘోర అవ‌మానం ఎదురైంది. ఈ అవ‌మానాన్ని ఉమా కూడా ఊహించ‌లేక‌పోయారు. ఉమాను చంద్ర‌బాబు ఏదైనా తిట్టారా ? అస‌లు ఏం జ‌రిగింది ? ఈ ఫైర్ బ్రాండ్ మినిస్ట‌ర్‌కు చంద్ర‌బాబు ముందే ఎందుకు అవ‌మానం ఎదురైందో చూద్దాం.

తాజాగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ వర్క్ షాప్ జరిగింది. దీనికి పెద్ద ఎత్తున నేతలు.. కార్యకర్తలు హాజరయ్యారు. అందరి మాదిరే మంత్రి దేవినేని ఉమ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ వ‌ర్క్ షాప్ ముగిశాక ఉమా మంత్రి హోదాలో బాబు వ‌ద్ద‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. బాబుకు సెక్యూరిటీగా ఉన్న బ్లాక్ క్యాట్ క‌మాండోలు ఉమాను బాబు వ‌ద్ద‌కు వెళ్ల‌నీయ‌లేదు.

త‌న‌నే అడ్డుకోవ‌డంతో ఉమా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. తాను మంత్రిని అని ఆయ‌న చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసినా వారు విన‌లేదు. ఇంత‌లో లోక‌ల్ పోలీసులు జోక్యం చేసుకోవ‌డంతో ఉమాను అప్పుడు లోప‌ల‌కు పంపారు. ఇటీవ‌ల ఏవోబీ ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఇప్ప‌టికే ఉన్న జ‌డ్ ఫ్ల‌స్ సెక్యూరిటీని మ‌రింత పెంచారు.

బ్లాక్ క్యాట్ క‌మాండోల‌కు తెలుగు రాకపోవటం.. తరచూ మారిపోవటంతో మంత్రుల్ని గుర్తించటంలో జరిగిన పొరపాటుతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. మంత్రిగా ఉన్న త‌న‌నే సీఎం వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డంతో ఉమా ఫీల్ అవ్వాల్సిన ప‌రిస్థితి ఎదురైంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *