నా కెప్టెన్సీపై నిర్ణయం బీసీసీఐదే: ధోనీ

టీమిండియా  క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ అని స్పష్టం చేశాడు. తాను కెప్టెన్గా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తాను నిర్ణయించలేనని, బోర్డే తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు.

నాకై నేను ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం లేదు. కొత్త కోచ్‌కు కమ్యూనికేషన్ అనేది పెద్ద సమస్య కాకపోవచ్చు. హిందిలో మాట్లాడటమనేది కేవలం అర్హత ప్రమాణం మాత్రమే. భాషకు మించి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకునే కోచ్ అయితే బాగుంటుంది. ఇది గతంలో కూడా రుజువైంది. దేశం తరుఫున ఆడటమనేది గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం నాకు 35 ఏండ్లు. ఈ వయస్సులో వేగంగా పరిగెత్తడం సాధ్యపడదని తెలుసు. కానీ మరింత ఫిట్‌గా ఉండేందుకే ఆసక్తి చూపిస్తాను.’వచ్చే ప్రపంచ కప్నకు ఇంకా సమయముంది. ఈలోపు మార్పులు జరగవచ్చని భావిస్తున్నా’ అని చెప్పాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *