నిద్ర సమస్యలను కలిగి ఉన్నారా? అయితే ఈ టీలు మీకు సహాయపడతాయి

రోజులో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు అన్ని పూర్తి చేసి రాత్రి అవగానే ఇష్టమైన ఒక కప్పు టీ తాగి మంచి నిద్రపోవాలని అనుకుంటారు. కొన్ని రకాల టీ తాగటం వలన రాత్రి సమయంలో నిద్రలో భంగం కలగవచ్చు. ఏ రకం టీలు మంచి నిద్రను అందిస్తాయి? హెర్బల్ టీలు అన్ని విధాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఔషద గుణాలను కలిగి ఉండే టీ పొడి వృక్షాల ఆకులు, కాండం, వేరు మరియు పండ్ల నుండి తయారు చేస్తారు మరియు ఇవి కెఫీన్ ను కలిగి ఉండవు. కావున హెర్బల్ టీలను తాగటం వలన మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. రాత్రి త్వరగా నిద్రను అందించే టీల గురించి ఇక్కడ తెలుపబడింది.

చామోమిలే టీ

చామోమిలే లేదా సీమ చామంతి నుండి తయారు చేసే టీ మంచి నిద్రను అందించటమేకాకుండా, ఒత్తిడిని కూడా త్వరగా తొలగిస్తుంది. 2010వ సంవత్సరంలో జరిపిన పరిశోధనల ప్రకారం, చామోమిలే లేదా సీమ చామంతి టీ తేలికపాటి ప్రశాంతకము మరియు నిద్రను అందించే ఔషదంగా పేర్కొన్నారు. పడుకునే ముందు ఒక కప్పు చామోమిలే టీ తాగటం ద్వారా మంచి నిద్రను పొందవచ్చు.

వలేరియన్ టీ

ప్రశాంతమైన నిద్రను అందించే మరొక హెర్బల్ టీ- వలేరియన్ టీని పేర్కొనవచ్చు. “జర్నల్ స్లీప్ మెడిసిన్ రివ్యూస్”లో ప్రచురించన అధ్యయనాల ప్రకారం, వలేరియన్ టీ మంచి నిద్రను అందిస్తుందని మరియు ఇది తాగటం వలన ఎలాంటి అనారోగ్యాలు కలగవని, సురక్షితమని నిరూపించే ఆధారలు ఉన్నాయని నిపుణులు తెలిపారు.

తెల్ల జుమ్కి (పాసినో ఫ్లవర్ టీ)

తెలుగులో తెల్ల జుమ్కి గా పిలిచే పాసినో ఫ్లవర్ ను పానీయాల రుచి పెంచటానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఇది విడుదల చేసే GABA (గామా అమైనోబ్యూటైరిక్ ఆసిడ్) స్థాయిలను పెంచుతుంది, ఇది శరీరాన్ని శాంతపరచి, మంచి నిద్రను అందిస్తుంది. 2011లో, డబుల్ బ్లైండ్ అధ్యయనాలు ఒక సమూహానికి పాసినో ఫ్లవర్ టీని ఇచ్చారు. ఈ టీ తాగిన వారు మంచి నిద్రను పొందారు.

లావెండర్ టీ

విశ్రాంతిపరచి మరియు మంచి నిద్రను అందించే వారిలో లావెండర్ టీ కూడా ఒకటి. నిపుణులు టీ రూపంలో ఉండే లావెండర్ శక్తి సామర్థ్యాలను గమనించనప్పటికీ, నిద్రను అందించటంలో ఇది శక్తివంతంగా పని చేస్తుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *