త్రివిక్రమ్-ఎన్టీఆర్…కాంబినేషన్ కలేనా?

జనతా గ్యారేజ్’ సూపర్ సక్సస్స్ ను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ తరువాత నటించ బోయే సినిమాల విషయంపై వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల మధ్య ఎందరో దర్శకుల పేర్లు హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ ల మూవీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

కొన్ని కాంబినేషన్ లు చాలా ఆశక్తిగా ఉంటాయి కానీ ఎందుకో అంత త్వరగా సెట్ కావు. అలాంటి వాటిలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి అన్న విషయం వాస్తవం. గత కొంత కాలంగా ఈ కాంబినేషన్ పై వార్తలు వస్తున్నా ఎక్కడో ఏదో సమస్య వల్ల ఈ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదు అన్న కామెంట్స్ ఉన్నాయి.

గతంలో ఒకసారి ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే అయి చివరి నిమషంలో ఆగిపోయింది అన్న వార్తలు ఉన్నాయి. త్రివిక్రమ్ సొంత నిర్మాణ సంస్థగా పేరు గాంచిన హారిక హాసిని ప్రొడక్షన్స్ పై ‘అ ఆ’ మూవీ నిర్మాణానికి ముందు ఈ ప్రయత్నం జరిగింది అని అంటారు. హారిక హాసిని అధినేత చినబాబు స్వయంగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లడమే కాకుండా అప్పట్లో త్రివికరమ్ జూనియర్ వద్దకు రెండుసార్లు వెళ్లాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే అప్పట్లో ఏదో కారణంతో జూనియర్ త్రివిక్రమ్ కంటే కొరటాల బెటర్ అని భావించి తారక్ కొరటాల వైపు వచ్చి ‘జనతా గ్యారేజ్’ చేసాడు అన్న గాసిప్పులు కూడ హడావిడి చేసాయి. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ 100 కోట్ల సినిమాగా మారిన నేపధ్యంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను కలపాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది.

ఒక ప్రముఖ నిర్మాత పట్టువదలని విక్రమార్కుడిలా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్ళి ఈ కాంబినేషన్ కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు హల చెల్ చేస్తున్నాయి. అయితే ఆ ప్రముఖ నిర్మాత త్రివిక్రమ్ కు పారితోషికం గురించి ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా త్రివిక్రమ్ వ్యూహాత్మకంగా నోరు విప్పడం లేదు అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ‘జనతా గ్యారేజ్’ హిట్ తరువాత ఎన్టీఆర్ స్వయంగా త్రివిక్రమ్ ఫోన్ చేసి సినిమా చెద్దామని అడిగాడనే టాక్ ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం జూనియర్ కు త్రివిక్రమ్ నుండి డిప్లమాటిక్ ఆన్సర్ మాత్రమే వచ్చింది. కాని ఎటువంటి స్పష్టమైన సమాధనం జూనియర్ కు త్రివిక్రమ్ నుంచి రాలేదు అని అంటున్నారు. దీనితో ఇది అంతా త్రివిక్రమ్ పవన్ తో చేయబోతున్న సినిమాను దృష్టిలో పెట్టుకుని చేసాడు అని ఫీల్మ్ నగర్లో టాక్? మరో ప్రక్క ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా ప్రకటన కోసం ఎన్టీఆర్ ఫ్యామిలి ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు కూడా క్లారిటి వచ్చే ఆవకాశం లేదు అని అతని సన్నిహితులు చెబుతున్నారు.

Videos

14 thoughts on “త్రివిక్రమ్-ఎన్టీఆర్…కాంబినేషన్ కలేనా?

Leave a Reply

Your email address will not be published.