డిజే స్టొరీ ఇదేనట..

ఎలా వచ్చిందో తెలియదు కాని అసలు ఇది నిజమో కాదో తెలియదు కాని డిజే కథ లీక్ అయ్యింది అంటూ ఒక వార్త ఇప్పుడు బాగా చక్కర్లు కొట్టడం బన్నీ ఫాన్స్ నే కాదు సినిమా లవర్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటోంది. సరిగ్గా ఇంకా రెండు రోజుల కంటే కాస్త ఎక్కువ సమయం మాత్రమే ఉంది ఫస్ట్ షో పడటానికి. కాని ఈ లోపే ఇలాంటివి ఊపందుకోవడం విశేషం.

బయటికి వచ్చిన కథ ప్రకారం డిజే అనగా దువ్వాడ జగన్నాధం అగ్రహారం లో వంటల మాస్టారుగా పని చేస్తుంటాడు. శుద్ధ శాఖాహారిగా అగ్రహారం ఏ చిన్న ఫంక్షన్ జరిగినా బాధ్యతంతా తన నెత్తి మీద వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒక ఫంక్షన్ పరిచయం అవుతుంది పూజా హెగ్డే. అప్పటికే ఆమెను పెళ్లి చేసుకోవాలని బావ వెన్నెల కిషోర్ వెంటపడుతూ ఉంటాడు. ఆ అగ్రహారం దగ్గరలో అక్కడ ఉండే బ్రాహ్మణుల పేరు మీద కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఉంటుంది. దాని మీద అక్కడే వ్యాపారం చేసుకునే చదువు రాని రొయ్యల నాయుడు కన్ను పడుతుంది. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

అప్పుడే విదేశాలలో ఉన్న మరో విలన్ అక్కడి నుంచి తన మనుషులను పంపిస్తాడు. ఆ క్రమంలోనే డిజే వాళ్ళతో గొడవ పడతాడు. అక్కడితో ఇంటర్వెల్ బ్లాక్. కట్ చేస్తే తాడో పేడో తేల్చుకోవాలని తన గెటప్ మార్చుకుని విలన్ ఉన్న దేశానికి వెళ్ళడానికి సిద్ధ పడతాడు డిజే. అక్కడ వాడిని చూసాక షాక్ తింటాడు. తనకు గతంలో కుటుంబానికి ద్రోహం చేసిన వాడు కూడా వీడే అని గుర్తిస్తాడు. దాంతో అగ్రహారం భూములను కాపాడటం ఒక వైపు, తన పర్సనల్ రివెంజ్ మరోవైపు రెండు ఎలా బదులు తీర్చుకుంటాడు అనేది మిగిలిన కథ.

కథ బాగానే అనిపించినా రెగ్యులర్ కమర్షియల్ షేడ్స్ చాలా ఉన్నా కూడా హరీష్ శంకర్ ట్రీట్మెంట్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని టాక్. కామెడీ తో కడుపుబ్బా నవ్వించే హరీష్ ఇంటర్వెల్ నుంచి మాస్ ప్రేక్షకులను కుర్చీలో కూర్చోబెట్టడట. ముఖ్యంగా విలన్ ని అగ్రహారనికే రప్పించి అక్కడే రొయ్యల నాయుడు, ఆ విలన్ భరతం పట్టే ఎపిసోడ్ ఇవన్ని మామూలుగా ఉండవని టాక్.

కథ ఇది అయినా కాకపోయినా అందరికి బన్నీ, హరీష్, దిల్ రాజు కాంబో మీద గట్టి నమ్మకం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ థియేటర్స్ కి సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ సండే దాక దాదాపు అమ్ముడుపోయింది. ఇక డిజే వాయింపుడు షురు అని చెప్పొచ్చు

Videos

24 thoughts on “డిజే స్టొరీ ఇదేనట..

Leave a Reply

Your email address will not be published.