బాహుబలిలో చూపించిన పసికందు ఎవరో తెలుసా..?

బాహుబలి… రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా అయిపోయింది. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషనే అవుతోంది. మరి ఇప్పుడు తాజాగా మనకు తెలిసిన అలాంటి ఓ ముఖ్యమైన వార్త ఏంటో తెలుసా..? బాహుబలి 1, 2 పార్ట్‌లలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరూ పసికందులుగా ఉన్నప్పుడు చూపించిన ఆ బాలుడి గురించే..! అయితే నిజానికి ఆ పసికందు బాలుడు కాదు, బాలిక..! ఆ పాప పేరు అక్షర..!

బాహుబలి సినిమా షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద జరిగింది. ఆ సమయంలో కేరళ అంగన్‌వాడీ ప్రాంతానికి చెందిన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాహుబలి కోసం పనిచేస్తున్నాడు. అతనికి అప్పుడే అక్షర జన్మించింది. అయితే అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరినీ పసికందులుగా చూపించినప్పుడు మొదట గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నారట. కానీ… దర్శకుడు రాజమౌళి పట్టుబట్టే సరికి ఇక ఆ అవకాశం బేబీ అక్షరకు దక్కింది.

బాహుబలిలో నటించే సమయానికి బేబీ అక్షర వయస్సు కేవలం 18 రోజులు కావడం విశేషం. దీంతో అత్యంత చిన్న వయస్సులోనే బాహుబలిలో నటించిన యాక్టర్‌గా బేబీ అక్షర గుర్తింపు పొందింది. బాహుబలి మొదటి పార్ట్‌లో శివగామి మహేంద్ర బాహుబలి (శివుడు)ని ఎత్తుకుని నదిలో ఉన్నప్పుడు చూపించింది, ఆ తరువాత ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో అమరేంద్ర బాహుబలి పుట్టినప్పుడు శివగామి చేతి వేలిని పట్టుకున్నప్పుడు చూపించింది, రెండో పార్ట్‌లో ఫ్లాష్ బ్యాక్ కొనసాగుతుండగానే మహేంద్ర బాహుబలిగా శివగామి పసికందును జనాలకు చూపించింది, కట్టప్ప తన తలపై కాలును పెట్టుకున్నప్పుడు చూపించిన పసికందు ఒక్కరే. బాహుబలి రెండు ప్రాతలకు చిన్నప్పుడు పసికందుగా చూపించింది ఒక్క బేబీనే..! ఆ బేబీయే అక్షర. అలా ఆ సినిమా షూటింగ్ అయ్యే వరకు ఆ పాప వెంటే ఆమె తల్లి కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Videos

Leave a Reply

Your email address will not be published.