అమలాపురంలో విషాదం…

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఆర్థిక నష్టాలను భరించలేక ఓ వైద్యుడు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా టి.కృష్ణా ఆర్థోపెడిక్‌ సెంటర్‌ వైద్యుడు రామకృష్ణరాజు(48) భార్య లక్ష్మిదేవి(45), కుమారుడు కృష్ణసందీప్‌ (25) కొంతకాలంగా నివాసముంటున్నారు. ఇటీవల రామకృష్ణరాజు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. అవి నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలుసుకోవాల్సి ఉందని అమలాపురం డీఎస్పీ మాసుమ్‌ బాష తెలిపారు.

Videos