దసరా బయ్యర్లు సేఫేనా – కలెక్షన్ రివ్యూ

దసరా పండగకు వారం ముందే వచ్చి వసూళ్ల ధమాకా అందుకున్న అరవింద సమేత వీర రాఘవ స్లో అయిపోయింది. పండగ రోజులను పూర్తిగా వాడేసుకున్నాక డ్రాప్ ఉన్న మాట వాస్తవం. ఇప్పటిదాకా 85 కోట్ల దాకా షేర్ తెచ్చిన రాఘవుడు ఇంకో 10 రాబడితే నో లాస్ నో ప్రాఫిట్ జోన్ లోకి సేఫ్ గా వచ్చేస్తాడు. ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు ఈజీగానే చేరుకోవచ్చు. పైగా పోటీ సినిమాలు వీక్ గా ఉండటం ఈ వారం పెద్దగా చెప్పుకునే సినిమా ఏదీ లేకపోవడం ప్లస్ గా నిలిచింది. ఇక సరిగ్గా పండగ రోజునే వచ్చిన హలో గురు ప్రేమ కోసమే, పందెం కోడి 2 రెండు ఆక్సిజన్ బెడ్ మీద పోరాడుతున్నాయి.

హలో గురు ప్రేమ కోసమే కొంత బెటర్ అని చెప్పొచ్చు. 24 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పటిదాకా 14 కోట్ల పైచిలుకు షేర్ తెచ్చింది. కానీ నిన్నటి నుంచి చాలా చోట్ల డల్ అయిపోయింది. యూత్ నుంచి రిపీట్ ఆడియన్స్ వచ్చేంత మ్యాటర్ ఇందులో లేకపోవడం మైనస్ గా మారింది. ఆ పది కోట్లు రావడం అంత సులభం కాదు. పైగా ఓవర్ సీస్ తో డిజాస్టర్ గా తేలిపోయింది. ఇప్పటిదాకా అర మిలియన్ మార్కు కూడా చేరుకోలేదు.అది కూడా కష్టమే అంటున్నారు.

ఇక పందెం కోడి 2 విషయానికి వస్తే విశాల్ కెరీర్ లో ఎక్కువ రేట్ కు అమ్మిన సినిమా ఇదే. 10 కోట్ల 50 లక్షల దాకా బిజినెస్ చేసారు. వీకెండ్ కలుపుకుని ఇప్పటిదాకా వచ్చింది 5 కోట్ల షేర్ మాత్రమే. ఇంకో 5 వస్తే గట్టెక్కినట్టే కానీ నెగటివ్ టాక్ శాపంగా మారి కొత్త ప్రేక్షకులను థియేటర్ దాకా తేలేకపోతోంది. విశాల్ గత సినిమా అభిమన్యుడు 7 కోట్ల బిజినెస్ తో 11 కోట్ల దాకా రాబట్టి మంచి లాభాలు ఇచ్చింది. కానీ పందెం కోడి 2 అమ్మడమే ఆ రేట్ కు అమ్మారు కాబట్టి భారీ నష్టాలు తప్పవు.

సో విన్నర్ గా అరవింద సమేత వీర రాఘవ యునానిమస్ గా గెలిచేసింది. ఇంకా పది కోట్లు రావలసిన నేపధ్యంలో ఇది తొందపాటు ప్రకటన అనిపించినా అది రావడం ఖాయమే అని ట్రేడ్ రిపోర్ట్. సో మూడు సినిమాల్లో రెండింటికి 10 కోట్ల టార్గెట్ మరొకదానికి 5 కోట్ల టార్గెట్ పూర్తయితేనే హిట్ కిందకు వస్తాయి. అది మరో వారం పది రోజుల్లో తేలిపోతుంది.

Videos

14 thoughts on “దసరా బయ్యర్లు సేఫేనా – కలెక్షన్ రివ్యూ

Leave a Reply

Your email address will not be published.