పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్ర భూకంపం

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో సంభవించిన తీవ్ర భూకంపం. ఈ ఘటనలో  26 మంది మృతి చెందగా 300 మందికిపైగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు ఉత్తర ప్రాంతంలోని పలు నగరాల్లో భూమి కంపించింది. దీని ప్రభావంతో భారత్‌లో..రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌ల్లోనూ భూమి కంపించింది. తీవ్ర ప్రకంపనలు రాకవడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాలు వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. పంజాబ్‌ ప్రావిన్సులోని పర్వత ప్రాంతం జీలం కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్‌ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, దీని తీవ్రత 7.1 వరకు ఉందని సైన్స్‌ శాఖ మంత్రి ఫవాద్‌ ఛౌదరి అన్నారు. భూకంప కేంద్రం పీవోకేలోని న్యూ మీర్పూర్‌ సమీపంలో ఉందని అమెరికా తెలిపింది.

Videos