‘రోబో-2’ క్లైమాక్స్: విశేషాలు

రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్లో రూపొందిన ‘రోబో’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోబో చిత్రం చూసిన ప్రతీ ప్రేక్షకుడూ ఖచ్చితంగా రోబో 2 గురించి ఎదురుచూస్తాడు అనటంలో సందేహం ఏ మాత్రం లేదు. అందులోనూ రోబో లో క్లైమాక్స్ సీక్వెన్స్ ఇప్పటికీ మనందరి కళ్లముందే ఉంది. అంత అద్బుతంగా చిత్రీకరించారు శంకర్.

యూనిట్ వర్గాల నుంచి విశ్వసయనీంగా అందుతున్న సమాచారం ప్రకారం…క్లైమాక్స్ పోర్షన్స్… ముఖ్యంగా హై ఓల్టేజి యాక్షన్ సీన్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ల మధ్య చిత్రీకరించారు. దాదాపు క్లైమాక్స్ షూటింగ్ పూర్తైపోయినట్లే. ఆ షూటింగ్ మొత్తం డిల్లీ స్టేడియంలో చిత్రీకరించారు. ఇది 45 రోజుల షెడ్యూల్. ఇప్పుడు ప్రస్తుతం టీమ్ మొత్తం చెన్నై వచ్చింది. రజనీతో సహా అందరూ డిల్లీ లోని విపరీతమైన వేడికి అలిసిపోయారు.

షూటింగ్ ని కంప్లీట్ చేయటం చాలా కష్టమైపోయింది. అంతేకాదు..ఈ పర్టిక్యులర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించటం కెమెరామెన్ నీరవ్ షాకు పెద్ద పరీక్షగా మారింది. ఈ హై ఓల్టేజి ఫైట్ సీక్వెన్స్ లో రోబోటిక్ ఎక్విప్ మెంట్ కూడా ఉండటం,వాటిని అన్నిటినీ సమన్వయ పరుచుకుని తీయటం ఓ ఛాలెంజ్.

robo-2-climax
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఎందిరన్‌-2′ (రోబో 2) కొన్ని నెలల క్రితం చిత్రీకరణ ప్రారంభమైంది. చెన్నైలోని ఈవీపీ స్టుడియోలో కట్టుదిట్టమైన భద్రత మధ్య సెట్స్‌పైకి వెళ్లింది.

హాలీవుడ్‌ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని తీస్తుండటంతో బడ్జెట్‌ భారీగానే అవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంలోనే కళ్లు చెదిరేలా వేసిన సెట్స్‌ కోసంకోట్లు ఖర్చు చేశారు.

ఈ సినిమా షూటింగ్‌ కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఓ సిటీ సెట్‌ వేశారు. ఇందులో అక్షయ్‌.. రజనీల మధ్య సినిమాలోని కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం రూ. 20 కోట్లు ఖర్చు చేశారట.

చిత్రీకరణలో సెట్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలుంటాయని చెబుతున్నారు. దీన్ని బట్టి సినిమా ఇంటర్వెల్ అయివుంటుందని అనుకుంటున్నారు.

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ చిత్రంగా ‘రోబో 2.0′ ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో అసలు ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెడుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోందని నిర్మాత లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించారు. ఇది ఇండియన్ సినిమాలోనే హై బడ్జెట్ ఇది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *