క్షీణించిన మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం…

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే శివప్రసాద్ ఆరోగ్యం నేడు మరింత క్షీణించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై సాయంతో చికిత్స అందిస్తున్నారు. శివప్రసాద్‌ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరా తీస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చెన్నై వెళ్లి శివప్రసాద్‌ను ఆయన పరామర్శించనున్నారు.

శివ ప్రసాద్ కొద్ది రోజులుగా మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పరిస్తితి విషమించడంతో ఇటీవలే ఆయనకు చెన్నై లో చికిత్స చేయయించారు. సుమారు రెండు వారాల పాటు ఆయన చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి మూత్ర పిండల్లో సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను గురువారం ఉదయం చెన్నై హాస్పిటల్ కి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్తితి విషమించినట్లు వైద్యులు చెప్పారని సమాచారం.

Videos