ప్రభుత్వ లాంఛనలతో అంత్యక్రియలు చేయండి: జగన్

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసారావు మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ ఎల్బీ సుబ్రహ్మణ్యానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మాజీ స్పీకర్ కోడెల తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల మృతి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. కాసేపట్లో కోడెల భౌతికకాయం గుంటూరు టీడీపీ కార్యాలయానికి చేరుకోనుంది.

కోడెల శివప్రసాదరావు సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన భార్యతో కలిసి టిఫిన్‌ చేశారు. 10.10 గంటల సమయంలో మొదటి అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లారు. ఎంత పిలిచినా ఆయన తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. వెంటనే డ్రైవర్‌ ప్రసాద్‌ కిటికీ తలుపు పగులగొట్టి.. లోపలికి వెళ్లి డోర్‌ తీశారు. అదే సమయంలో గన్‌మన్‌ యాదవ్‌ అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి ఆయనను కిందకు దించారు. హుటాహుటిన, బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం కోడెల మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Videos