ఇంగ్లండ్‌లో భారీ పేలుడు.. 19 మంది మృతి

ఇంగ్లాండ్‌ పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే నిర్వహిస్తున్న సంగీత కచేరీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10: 35 గంటలకు పేలుడు సంభవించినట్లు గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పేలుడు జరిగిన  ప్రాంతాన్ని ఖాళీ చేయించిన అధికారులు.. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటనను ఉగ్రవాదుల చర్యగా అనుమానిస్తున్నారు. పాప్‌ సింగర్‌ అరియానా క్షేమంగా ఉన్నారని ఆమె ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published.