మరో చిన్న సినిమా… భారీ స్థాయి లో బిజినెస్!

ఈ ఏడాది ద్వితీయార్తంలో భారీ ఎత్తున విడుదలైన సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు. బ్రూస్ లీ, అఖిల్, సైజ్ జీరో… వంటి సినిమాలు ఇంటా బయట డిజాస్టర్స్ గా నే మిగిలాయి. అయినా కూడా సినిమాల వ్యాపారం మాత్రం ప్రవర్ధమానంగా సాగుతోంది. ఒకవైపు బెంగాల్ టైగర్ ముప్పై కోట్ల రూపాయల పై స్థాయి ఫిగర్స్ ను రీచ్ కాగా… మరో చిన్న సినిమా వ్యాపారగణాంకాలతో ఆకట్టుకొంటోంది. అదే “ఎక్స్ ప్రెస్ రాజా”. శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా పై బయ్యర్లు ఆసక్తిని చూపిస్తున్నారు.

అటు ఓవర్సీస్ లోనూ.. ఇటు దేశీయంగా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయినట్టుగా తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనుక్కోవడానికి చాలా ఉత్సాహాన్నే ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. దీనికి చాలా  రీజన్లున్నాయి. అటు హీరో శర్వానంద్ ఒకరీజన్ అయితే.. దర్శకుడు మరో రీజన్. ఈ మధ్య శర్వాడీసెంట్ హిట్స్ తో ఉన్నాడు. “మళ్లీ మళ్లీ ఇది రానిరోజు” సినిమా తర్వాత ఓవర్సీస్ లో అతడి రేంజ్ పెరిగింది. ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోగా లోకల్ గా కూడా ఆకట్టుకొంటున్నాడు. దీంతో “ఎక్స్ ప్రెస్ రాజా” బిజినెస్ వేగం ఊపందుకొంది.

అలాగే తన తొలిసినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు  మేర్లపాకగాంధీ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. తొలి సినిమా పూర్తి చేసిన చాలా విరామం తర్వాత అతడు ఈ సినిమాను రూపొందించాడు. దీంతో ఈ సినిమాపై చాలా కసరత్తే చేశాడనిపిస్తోంది. అతడిపై ఉన్న నమ్మకం కూడా ఈ సినిమా బిజినెస్ ను ఇరవై కోట్ల రూపాయల రేంజ్ కు తీసుకెళ్లిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి “ఎక్స్ ప్రెస్  రాజా’ టైటిల్ లోనూ.. బిజినెస్ లోనూ ఉన్న వేగం తెరపై, కలెక్షన్లలో కనిపిస్తుందేమో చూడాలి!

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *