ప్రొద్దుటూరులో నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు (వీడియో)

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు కిరాతకంగా నరికి చంపారు. పట‍్టణ నడిబొడ్డున ఉన‍్న కోర్టు వద్ద మారుతి ప్రసాద్‌‌రెడ్డి అనే వ్యక్తిని అతికిరాతకంగా మచ్చుకత్తితో నరికి చంపారు. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. ప్రత‍్యక్షంగా హత‍్య దృశ్యాలు చూసి పరిసర ప్రాంతాల జనం భయభ్రాంతులకు గురయ్యారు. మృతుడు జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందినవాడని తెలిసింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స‍్థలానికి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్య కోర్టుకు సమీపంలో జరగడంతో జనాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్థలం విషయమై కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వస్తున్న వ్యక్తిని ప్రత్యర్థులు కాపుకాసి తొలుత గొడ్డలితో నరికారు. కోర్టు ఎదురుగా రోడ్డు డివైడర్‌ వద‍్ద పడిపోయిన మారుతీప్రసాదరెడ్డిని వదలకుండా మళ్లీ వచ్చి కత్తులతో హతమార్చారు. దేవగుడికి చెందిన చంద్ర అనే వ‍్యక్తి సోదరితో మారుతీప్రసాద్‌రెడ్డికి వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయమై గతంలోనూ చాలా గొడవలు జరిగాయని చెబుతున్నారు. అయినా అతను పద‍్ధతి మార్చుకోకపోవడంతో మరో కేసులో కోర్టుకు హాజరైన మారుతీప్రసాదరెడ్డిని మట్టుబెట్టారని తెలుస‍్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *