స్పీచ్ ఇస్తూండగానే ….పవన్ ఫ్యాన్స్, బన్ని ఫ్యాన్స్ ఫైట్

నిన్న రాత్రి జరిగిన నాగేంద్రబాబు కుమార్తె నిహారిక నటించిన ‘ఒక మనసు’ చిత్రం ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు. అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ లో తన మనస్సులో మాటలు చెప్పిన సంగతి తెలిసిందే. తాను వేరే హీరోల ఆడియో ఫంక్షన్స్ లో సైతం పదే పదే పవన్ గురించి మాట్లాడమనటం బాగోలేదని, అలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..పట్ల చాలా అన్ కంపర్టబుల్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు.

బన్నీ తన స్పీచ్ ద్వారా మెగా అభిమానుల్లో ఉన్న అంతర్గత విభేదాలు సమసిపోయేలా చేయడానికి తన వంతుగా ఎంత ప్రయత్నం చేసినా.. కొందరు అభిమానులు మాత్రం అతడి మాటలకు విలువ లేకుండా చేశారు. అనుకున్నట్లే ‘ఒక మనసు’ ఆడియో వేడుకకు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తునే హాజరయ్యారు. పవర్ స్టార్ పేరు చెప్పినపుడు వచ్చిన హర్షాతిరేకాల్ని బట్టే పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఈ వేడుకకు వచ్చారో అర్థమైపోతుంది. మరోవైపు అల్లు అర్జున్ ఎక్స్ క్లూజివ్ ఫ్యాన్స్ కూడా ఓ మోస్తరుగానే హాజరయ్యారు.

అల్లు అర్జున్ చెప్పిన మాటకు ఓ పవన్ ఫ్యాన్ సెటైర్ వేయటంతో, తట్టుకోలేని ప్రక్కనే ఉన్న బన్ని ఫ్యాన్ గొడవకు దిగారని, అలా ఈ గొడవ స్టార్టయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. మొదట వాగ్వాదాలతో మొదలైన గొడవ.. తర్వాత బాహాబాహీకి దిగే వరకు వెళ్లింది. ఓ పక్క బన్నీ తన పాటికి తాను మాట్లాడుతూ పోతుంటే ఈ అభిమానులు పరస్పరం దాడులకు దిగారు. ఒకరిపై ఒకరు పంచ్ లు విసురుకున్నారు. కాసేపటి తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. బన్నీ అంత చెప్పినా అభిమానులు ఇలా చేయడం పట్ల వేడుకకు హాజరైన వారిని విస్తుపోయేలా చేసింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *