క్యాప్ వెనుక మొహం దాచుకున్న కోహ్లీ

దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో బ్యాట్స్‌ మెన్‌ గానే కాకుండా.. కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచి అనూహ్యంగా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని టీమిండియా ఓటమికి సగం కారణమైన విరాట్ కోహ్లి డీఆర్‌ఎస్‌ నిర్ణయంలోనూ ఫెయిలయ్యాడు. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్ బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్ దీపక్ నకుల్ బాల్ విసరగా.. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఆర్. హెండ్రిక్స్ బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి అతని ఫ్యాడ్స్‌ ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం టీమిండియా అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. అయితే.. బంతి వికెట్లకి తాకేలా వెళ్లిందంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒప్పించిన దీపక్ చాహర్.. డీఆర్‌ఎస్‌ కోరేలా చేశాడు. రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌ లైన్‌ పడి వికెట్లకి చాలా దూరంగా వెళ్తున్నట్లు కనిపించడంతో.. విరాట్ కోహ్లీ సిగ్గుతో తన ముఖాన్ని క్యాప్‌తో కవర్ చేసుకోవాల్సి వచ్చింది.

Videos