6వ స్థానంలో ‘ఫిదా’: టాప్ 10 హిట్స్ ఇవే….

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మించిన ‘ఫిదా’ మూవీ అంచనాలను మించిన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, యూఎస్ఏలో టాప్ 10 హిట్ చిత్రాల లిస్టులో చేరి పోయింది.

యూఎస్ఏలో ఇంకా ఈచిత్రం సక్సెస్ ఫుల్‌గా 16 లొకేషన్లలో రన్ అవుతోంది. తాజాగా ‘ఫిదా’ మూవీ $2.028 మిలియన్ డాలర్ వసూలు చేయడం ద్వారా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రికార్డు($2.022 మిలియన్)ను అధిగమించి 6వ స్థానం దక్కించుకుంది. ఫిదా 5వ స్థానం దక్కించుకోవాలంటే ‘ఖైదీ నెం 150′ రికార్డు($2.447 మిలియన్)ను బద్దలు కొట్టాలి. అయితే అది అసాధ్యం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యూఎస్ఏలో టాప్ 10 స్థానంలో ఉన్న సినిమాల వివరాలు.

బాహుబలి-2 మూవీ యూఎస్ఏలో అన్ని భాషల్లో కలిపి $20.57 మిలియన్ డాలర్లు వసూలు చేసి నెం.1 స్థానంలో ఉంది.
2015లో విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ $6.99 మిలియన్ డాలర్ వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఎ‘శ్రీమంతుడు’ మూవీ 2.89 మిలియన్ డాలర్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది.

నితిన్-సమంత హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీ 2.449 మిలియన్ డాలర్లు వసూలు చేసి నాలుగో స్థానంలో ఉంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నెం 150′ యూఎస్ఏలో 2.447 మిలియన్ డాలర్లు వసూలు చేసి 5వ స్థానంలో ఉంది

ఫిదా మూవీ ఇప్పటి వరకు 2.028 మిలియన్ డాలర్ వసూలు చేసింది. ఇంకా రన్ అవుతోంది. అయితే ఈ చిత్రం 5వ స్థానానికి ఎగబాకడం కష్టమే.
సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం 2.022 మిలియన్ డాలర్ వసూలు చేసి 7వ స్థానంలో ఉంది.
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ మూవీ 1.89 మిలియన్ డాలర్ వసూళ్లతో 8వ స్థానంలో ఉంది.

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ మూవీ 1.80 మిలియన్ డాలర్లు వసూలు చేసి 9వ స్థానంలో నిలిచింది.

బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం యూఎస్ఏలో 1.66 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ 10 లిస్టులో కొనసాగుతోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *